మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థత

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థత

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు బంధువులు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు.. ప్రస్తుతం ఎయిమ్స్ లో మన్మోహన్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ఆయన సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారని మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ లో చేరినట్టు బంధువులు తెలిపారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత,  భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థత పట్ల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది ఏఐసీసీ.. మన్మోహన్‌ సింగ్‌.. ఎయిమ్స్ లో ప్రస్తుతం సాధారణ చికిత్స తీసుకుంటున్నారని…ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అవసరమైనప్పుడు మేం ఏదైనా ఉంటే మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌కు చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్‌ ఝా ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

కాగా, ఎయిమ్స్ లోని కార్డియాలజీ విభాగంలో మన్మోహన్‌ సింగ్ చేరినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మన్మోహన్ సింగ్ గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.

2009లో మన్మోహన్ కు బైపాస్ సర్జరీ చేశామని..1990 నుండి ఆయనకు 5 బైపాస్‌ సర్జరీలు జరగగా..2004లో స్టెంటింగ్ చికిత్స చేయించుకున్నారని ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపింది. మరోవైపు గత ఏడాది మే నెలలో ఛాతీలో నొప్పి రావడంతో  ఎయిమ్స్‌ లో చేరారని.. అప్పుడు మన్మోహన్‌ సింగ్ కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని… దీంతో కొంత ఇబ్బంది పడినప్పటికీ.. అప్పట్లో మన్మోహన్ కరోనా నుంచి కోలుకున్నారని తెలిపిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం.  ఇక, ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆసుపత్రిలో చేరారు. అయితే, విజయవంతంగా కోలుకున్న తర్వాత ఏప్రిల్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని వైద్యుల బృందం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *