భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు
భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు
‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. అయితే పోటీలో ఇరు ప్యానళ్ల మధ్య వాదోపవాదుల మధ్య మా ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ పోటీలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో గెలిచారని సాధించారని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆసమయంలో మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎన్నికల్లో విజయం ఊహించిందే అయినప్పటికీ మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. విజయం తర్వాత మాట్లాడ లేకపోయారు విష్ణు. విష్ణును నరేష్ ఓదార్చే ప్రయత్నం చేశారు.
మా ఎన్నికల్లో తనయుడు గెలవడం పట్ల మోహన్ బాబు మాట్లాడుతూ..ఇది మా ఒక్కరి విజయమే కాదు.. ఇది అందరి విజయం అని అన్నారు. అందరికి మంచు విష్ణు ఆశీసులుతో పాటుగా ఆ సాయినాథుడి ఆశీసులుండాలని కోరుకున్నారు. దీంతో పాటుగా కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ లతోపాటు పవన్ కళ్యాణ్ ఆశీసులు కూడా ఉండాలని కోరారు మోహన్ బాబు.