మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాటు తన కార్యవర్గ సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథి వచ్చారు. దీంతో పాటుగా నటసింహా బాలకృష్ణను మంచు విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

కాగా నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, మా కొత్త అధ్యక్షుడు విష్ణు మా అభివృద్ధిపై చర్చించిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం‏ను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని మంచు విష్ణు కోరారు.

కాగా, ఈ కార్యక్రమానికి గురువారం రోజున ఓ సినిమా సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ను మంచు మనోజ్‌ కలిశారు. మంచు మనోజ్‌ మా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్‌ని కోరినట్లు సమాచారం.

అయితే మంచు విష్ణు అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడతానని.. దీనిలో భాగంగా అందరినీ కలుపుకొని వెళ్తానని… తన ప్రత్యర్థి ప్యానల్ సభ్యులైన ప్రకాష్ రాజ్ టీమ్ లోని గెలిచిన వారందరినీ ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్‏లో ఆహ్వానించారని, దీంతో పాటుగా సభ్యులంతా రావాలని సందేశం పంపారు. అలాగే మా అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి మా కార్యాలయం మెసేజ్ ద్వారా ఆహ్వానం పంపిందని మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *