మా అధ్యక్షుడిగా మంచు విష్ణు

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Maa) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి మధ్య తోపులాట కూడా జరిగింది. ఫలితాల కోసం ఎదురుచూసిన అభిమానులు, నెటిజన్లు ఊహించినట్లుగానే కొంత ఉత్కంఠభరితంగా ఎన్నికలు సాగాయి. ఈ ఎన్నికల్లో కొంతమంది ఊహించినట్లుగానే ఈ ఎన్నికలో మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై ఎన్ని ఓట్ల తేడాతో విజయం సాధించారో కూడా చెప్పనున్నారు.