ఆన్ లైన్ లో ఆకులు అమ్మబడును

 ఆన్ లైన్ లో ఆకులు అమ్మబడును

 ఆన్ లైన్ లో ఆకులు అమ్మబడును

దేశ వ్యాప్తంగా ఈ-కామర్స్‌  రంగంలో అమెజాన్‌ ఒక అష్టదిగ్గజం. ఆన్ లైన్ లో అన్నిరకాల వస్తువులపై భారీగా ఆఫర్లు ప్రకటించిన అమెజాన్ దిగ్గజం. అయితే ఇందుకు భిన్నంగా ఆలోచించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుక కొత్త ఆలోచనలు చేసింది అమెజాన్.. అదేంటో చూద్దామరి..

హిందువుల పండుగలలో ప్రతీ పండుగకు మామిడాకుల ప్రత్యేకత స్థానం ఉంటుందండి. ఇంటి గుమ్మానికి మామిడాకులను తోరణంగా కట్టడం ప్రాచీన కాలం నుంచి వస్తోంది. హిందూ సంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరూ గుడి, బడి, దుకాణం, ప్రతి శుభకార్యాలో కూడా మామిడి మామిడి మండలతో తోరణాలు కడతారు. పల్లెల్లో మామిడాకులు విరివిగా లభిస్తాయి. మామిడాకులను పల్లెటూళ్ల నుంచి వచ్చి పట్టణాల్లో, నగరాల్లో పచారీ చేస్తూంటారు. మామిడాకులు కావాలంటే మార్కెట్‌కు వెళ్లి కొనాల్సిందే.

అయితే పండుగల వేళ పట్టణాలు, నగరాల్లో మామిడాకులు, పువ్వులు, ఇతర పూజా వస్తువులను మార్కెట్లో అమ్మడం సర్వ సాధారణమే. పండగకు అవసరమైన సామాగ్రి మొత్తం మార్కెట్లో లభిస్తాయి. కానీ ఇప్పుడు ఆన్‌లైన్లో కూడా దొరుకుతున్నాయి. పూజా వస్తువులే కాదు.. చివరకు మామిడాకులు సైతం ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు.

అయితే అమెజాన్‌లో మామిడాకులు అమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. ఆర్గానిక్ మామిడాకులు పేరిట తాజా మామిడాకులను అమ్ముతున్నారు. ఎమ్మార్పీపై డిస్కౌంట్ కూడా ఇచ్చారండోయ్…ఇకపోతే అమెజాన్‌లో ఓ అమ్మకం దారుడు ఎమ్మార్పీ రూ.290 ఉంటే 64శాతం డిస్కౌంట్‌తో రూ.109కే ఇస్తున్నట్లు.. 21 మామిడాకులను రూ.109కు విక్రయిస్తున్నారు. వెబ్‌సైట్లో పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక్కో ఆకును రూ.5కు అమ్ముతున్నట్లు న్నట్లేగా మరి..

మరో మామిడికాలు అమ్మే అతను 21 మామిడాకులను ధర రూ.77కి అమ్ముతున్నట్లు చెప్పారు. దీని ధర రూ.249గా ఉంటే.. 69శాతం డిస్కౌంట్‌తో రూ.77కే అమ్ముతున్నట్లు అమెజాన్‌లో అమ్ముతున్నారని చెప్పారు. అయితే అమెజాన్ వెబ్‌సైట్లో మామిడాకుల అమ్మకంపై కస్టమర్లు,  నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారండి.

మరీ…. ఇదెక్కడి విడ్డూరమండి..అని ఆశ్చర్యపోతున్నారు. ఇవే ఆకులు మా ఊళ్లో ఫ్రీగా దొరుకుతాయని.. మరికొందరూ మామిడాకులను కూడా ఆన్ లైన్ పెడుతూ అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారని.. ఐడియా చాలా బాగుందని నెటిజన్లు ఛలోక్తులు విసరుతున్నారు.

గతంలో ఆన్ లైన్ లో పిడకలు, కొబ్బరిచిప్పలు, తంగేటి, వేప పుల్లలు,  కూడా ఎప్పటి నుంచో అమెజాన్‌లో అమ్ముతున్నారు. అయితే బాబు వినరా.. నేను ట్రెండ్ చేస్తా.. నేను ట్రెండ్ ఫోలో అవ్వను.. అంటోంది అమెజాన్… పెద్దవాళ్లేతే.. అంతా కలికాలం రా నాయనా అంటున్నారండో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *