పెళ్లి కానీ యువతీ యువకులకు టైంమొచ్చింది..

పెళ్లి కానీ యువతీ యువకులకు టైంమొచ్చింది..

శ్రావణమాసం వచ్చేసిందండోయో..పెళ్లి బాజాల టైంమండోయి..

అయితే నాకేందుకులే అని..

పెళ్లి కానీ యువతీ యువకులు అనుకోకండోయో..

30ఏళ్లు దాటాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకొంటావు..? అమ్మానాన్న గొడవ. ఏరా, ఏమ్మా.. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా.. లేదా..అని మరో ప్రక్క బామ్మ, బంధువుల గొడవా..?. నీ తోటి స్నేహితులందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు..మరింకెప్పుడు చేసుకుంటావురా బాబు.. చూసినోళ్లంతా వీడీకి జన్మలో పెళ్లి కాదు రా.. బాబు..అంటూ స్నేహితుల హేళన.. ఇలా కాలక్షేపం చేస్తున్నా..పెళ్లికి మాత్రం అంగీకరించని పెళ్లి కానీ యువతీ యువకులకు టైం వచ్చిందండోయో..

దీనికి తోడు నేటి తరం తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి, అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. డాక్టర్ కావాలనీ..కట్న కానుకలు పెద్దగా వద్దు కానీ.. ఇంకా మరేదో కావాలనీ అంటున్నారు.. దీనికి తోడు యువత కూడా సెటిల్ అయ్యే సరికీ టైం పడుతోంది. అందుకే పెళ్లి ముచ్చట అంటే చాలు వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇక వివరాలోకి వెళితే..

అప్పుడే నాకు పెండ్లా..? అని 30వ వసంతంలోకి అడుగెడుతున్న అబ్బాయో, అమ్మాయో అంటే ఎలా ఉంటుంది..? పెండ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, ఎప్పుడు చేసుకోవాలన్నది వారి వ్యక్తిగత విషయం. పెండ్లి ఒక సామాజిక కట్టుబాటు.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ 30ఏళ్ల పై మాటే.. ఏజ్, గేజ్ బార్ అయితే కానీ పెళ్లి అనేది..ఎవరో చెబితే కానీ గుర్తుకురానీ మాట పెళ్లి.. ప్రస్తుతం మూడు పదులు నిండిన తర్వాతే మూడుముళ్ల బంధం.

నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం నేను ఇంకా బాగా సంపాదించిన తరువాతే `మ్యారేజ్ ` అని అంటున్నారు నేటి యువతరం..టెక్నాలజీని డెవలెప్ చేద్దాం అనీ..మరేదో సాధిద్దామని అనుకుంటుంది ఈ తరం ట్రెండ్.. కానీ ఆ సాధించేదోమో కానీ.. పెళ్లి వయస్సు కాస్త అయిపోతుందడి..అందుకే పెళ్లి పై అంతగా శ్రద్ద పెట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న యువతీ, యువకులు సంసారం, పిల్లలను కనడం అనే విషయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే ఉన్నత చదువుల కోసం చేసిన అప్పులు తీర్చుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని భావించుకొని..ముఖ్యంగా మధ్య తరగతి కుంటుంబంలో పుట్టిన యువత తమ కోసం శ్రమించిన అమ్మానాన్నలకు ఎంతోకొంత ఆర్థికంగా అందించాలన్నతపన అనేది ఈ తరానికి ఉందని భావించొచ్చు. అయితే ఉద్యోగంలో చేరగానే పెండ్లి చేసుకుంటే కెరీర్‌ దెబ్బతింటుందనే భయం, సంసార బంధంలో చిక్కుకుంటే అప్పటిదాకా అనుభవించిన స్వేచ్ఛ దూరమవుతుందనే ఆందోళన వెంటాడుతోంది ఈ తరానికి..

వీటికి తోడు తమకు తగిన జోడీ.. తన భావాలకు అనుగుణంగా.. దొరకకపోవడం, తమ స్థాయికి తగ్గ సంబంధాలు రాకపోవడం..మరో ప్రక్క ప్యాకేజీలలో వ్యత్యాసాలు, ఆస్తులు, జాతకాలు అంటూ.. ఇలాంటి సవాలక్ష కారణాలు పెండ్లి వాయిదాపడటానికి కారణాలవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడంతో పిల్లల పెండ్లి గురించి తొందర పెట్టేవారు కరువయ్యారు.

మూడు పదులు క్రాస్‌ అవుతున్నా.. ఏజ్‌ బార్‌ సమస్య ముంచుకొస్తున్నా..లేట్‌ మ్యారేజీ, మనో భావాలు కలవక పెళ్లై విడాకులు తీసుకున్న.. మళ్లీ పెళ్లి చేసుకున్నా…ఆయా జంటల భవిష్యత్‌ జీవితాలపై.. ఎలాంటి ప్రభావం చూపుతుందో.. వారికి పుట్టే పిల్లల విషయంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో.. సామాజిక సంబంధాల్లో ఏ మార్పులు వస్తాయో.. ఇలాంటివన్నీ సీరియస్‌గా ఆలోచించాల్సింన విషయాలు..

పురాతన కాలం నుంచి వితంతువులు మళ్లీ పెండ్లి చేసుకోవడం అనేది.. చరిత్ర తిరగేసినా దొరకని అంశం అయినప్పటీ. అదోక పీడకలగా భావించొచ్చు. అప్పట్లో ఎన్ని వెక్కిరింతలు, వెటకారాలు భరించాల్సి వచ్చేదో. కానీ నేటి తరానికి.. సామాజిక ఆమోదం లభిస్తున్నది. వృద్ధ జంటలకు పెండ్లి.. గత కాలంలో ఊహకందని విషయం. నిల్చోలేని, నడవలేని వృద్ధుడికి ముక్కుపచ్చలారని బాలికలను పెండ్లి చేసిన చరిత్ర మన ప్రాచీన కాలంలో ఉన్నది కానీ, ఒక వృద్ధుడు మరో వృద్ధురాలిని పెండ్లాడటం కొత్త ట్రెండ్‌! వృద్ధులకూ స్వయంవరాలొచ్చాయ్‌..అయితే దీనిని మనం కొత్త కోణంలో ఆలోచించాలే తప్పా.. మరో కోణంలోనూ ఆలోచించకూడదు.. ఎందుకంటే తోటు కోసమే తప్పా.. అదేదో చేద్దామని కాదు..

సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం: వయసు ముదిరిన తర్వాత పెండ్లాడటం వల్ల వచ్చే ముఖ్యమైన సమస్య సంతానోత్పత్తి సామర్థ్యం స్త్రీ పురుషులలో సన్నగిల్లడం. సాధారణంగా 35 ఏండ్లు దాటిన స్త్రీలకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. పెండ్లైన స్త్రీ అయ్యో నాకు పిల్లలు ఇంకా పుట్టలేదని బాధ, పెద్దలు, చుట్టుప్రక్కలవాళ్లు సూటిపోటీ మాటలనడం అనేది జరుగుతుంటుంది. దీంతో ఫెర్టిలిటీ సెంటర్లు, హాస్పిటల్స్‌ చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. అప్పటిదాకా సంపాదించినదంతా వాటికే ధారపోయాల్సిన దుస్థితి దాపురిస్తుంది. లేటు వయస్సు గర్భధారణ వల్ల గర్భిణీతోపాటు పుట్టే పిల్లలకూ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందనేది వైద్యుల అభిప్రాయం. ముఖ్యంగా గర్భిణీగా ఉన్నప్పుడు డయాబెటిస్‌, బీపీ లాంటి సమస్యలు తలెత్తడం, కవలలు జన్మించడం, జన్యులోపాలు, నెలలు నిండని, బరువు తక్కువ పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని వైద్య నిపుణుల హెచ్చరిక. లేటు వయస్సులో పిల్లలను కనడం వల్ల పిల్లలకు సరైన ఎదుగుదల అనేది ఉండదు.

భార్యభర్తలు ఉద్యోగస్తులైతే పిల్లలని చూసుకోనే టైం లేక.. బేబీ కేర్ సెంటర్లలో ఉంచాల్సిన పరిస్థితి. బేబీకి టైంకీ కావాల్సిన తిండి పెడతారో లేదో అని మరో సమస్య..చిన్నారులతో తగినంత సమయం గడపలేకపోతున్నామని, బుడిబుడి అడుగుల సవ్వడిని, ముద్దుముద్దు మాటల మాధుర్యాన్ని అనుభవించలేకపోతున్నామనేది మరికొందరి తల్లిదండ్రుల ఆవేదన.

వృద్ధాప్యంలో మరో వేదన!: వయసు ముదిరిన తరువాత పెండ్లి చేసుకొని, సంతానం కనడం వల్ల ఎదురయ్యేది మరో ముఖ్య సమస్య..అయితే  రిటైరయ్యే నాటికి సంతానం చేతికి అందిరాకపోవడం మరో సమస్య..పిల్లల  పట్ల తమ బాధ్యతలు తీర్చుకోలేకపోవడం మరో సమస్య.. ఒకవైపు తాము సంపాదన సామర్థ్యాన్ని కోల్పోతుంటే, తమ పిల్లలు కెరీర్‌లో ఇంకా స్థిరపడకపోవడం..వృద్ధాప్యంలో బాగా కుంగదీసే అంశం. అయితే మనకన్నా ముందే మ్యారేజ్ చేసుకున్న దంపతులు..మనుమలు, మనుమరాళ్లతో ఉల్లాసంగా గడుపుతుంటే.. మనం మాత్రం ఆ మాధుర్యాన్ని కోల్పోయామన్న బాధ వెంటాడటం సహజం.

లేట్‌ మ్యారేజీ బ్యాచ్‌తో పోల్చుకుంటే.. సకాలంలో పెండ్లి చేసుకొని, అన్యోన్యంగా సంసారం సాగిస్తున్న జంటలు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటున్నాయని, ఏమైనా సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటున్నారని అనేక అధ్యయనాలు, సర్వేలు సూచిస్తున్నాయి. కాబట్టి ముప్పైలోనూ పెండ్లికి తొందరేముంది? అనుకోకండి. అందుకే అంటారు పెద్దలు.. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట అదే వయస్సులో జరగాలని..

ఇది పెళ్లి కానీ యువతీ యువకులకు హెచ్చరిక.. సో బీ రెడీ.. తొందర పడండి.. ముహుర్తాలు చేదాటక పోకముందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *