మరోసారి మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు

మరోసారి మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు

మరోసారి మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు

దేశీయ కార్ల సంస్థలో మారుతీ సంస్థ ఒకటి. అయితే మా సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్నిపెంచనున్నట్లు దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబరు నుంచి అమల్లోకి రానున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ధరలు ఎంతమేరకు పెంచుతామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు మారుతీ సుజుకీ సంస్థ. ప్రస్తుత కాలంలో మా కార్ల తయారీ, నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరగడమే ధరల పెంపునకు కారణంగా వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్‌ఈ(BSE) ఫైలింగ్‌లో పేర్కొంది ఈ సంస్థ, అయితే మా కంపెనీలో మోడల్‌ని బట్టి ధరల పెంపు ఉంటుందని తెలిపింది. ఈ ఏడాదిలో జనవరి నుంచి మారుతీ ధరలు పెంచడం ఇది నాలుగోసారి. జనవరి 18న గరిష్టంగా కొన్ని మోడళ్ల కార్లపై రూ.34,000 వరకు, ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూం ధరలపై 1.6 శాతం పెంపు అమలు చేసింది. జులైలోనే అన్ని మోడళ్ల కార్ల మోడళ్లతో ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాల ధరలపై కొంత కన్ఫూజన్ అయితే ఉంది. దీనిపై సంస్థ క్లారిటీ ఇంకా ఇవ్వలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: