UP: 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని మోడీ 

UP: 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని మోడీ 

దేశంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని మోడీ 

దేశంలో కొత్త వైద్య విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చారు. అయితే కొత్తగా ప్రతి జిల్లాకొక పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆలోచన చేసింది. కొత్త వైద్య కళాశాలలకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి 9 మెడికల్ కాలేజీలను ప్రదాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఘాజిపూర్, మీర్జాపూర్, జౌన్‌పూర్‌, సిద్ధార్థ్‌ నగర్‌, ఈటా, హర్దోయి, ప్రతిప్‌ఘడ్‌, ఫతేపూర్‌, డియోరియాలలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని మాత్రమే నిర్మించింది. మిగతా 8 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించారు. ఓ ప్రత్యేక పథకం కింద వెనుకబడిన జిల్లాల్లో ఈ మెడికల్ కాలేజీలను నిర్మించించిన కేంద్ర ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సహా మొత్తం 10 రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది మోడీ సర్కార్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా  17,788 గ్రామీణ ఆస్పత్రుల్లో 11,024 పట్టణ ఆస్పత్రుల్లో వసతులు, వైద్యశాఖ సిబ్బంది, మెడికల్ ఉన్నతాధికారులను నియమించేందుకు అవకాశం ఇచ్చింది. తన నియోజకవర్గంలో రూ. 5,200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: