MG ASTOR Record: 20 నిమిషాల్లో 5 వేల కార్లు బుకింగ్
MG ASTOR Record: 20 నిమిషాల్లో 5 వేల కార్లు బుకింగ్
ప్రపంచ వ్యాప్తంగా కార్ల తయారీలో ఎంజీ కంపెనీ ఒకటి. అయితే ఈ కంపెనీ మారుతున్న కాలనుగుణంగా కొత్త టెక్నాలజీని జోడించి వివిధ రకాల మోడళ్లను వినియోగదారులకు మార్కెట్లో అందుబాటులో ఉంచుతుంది. బ్రిటన్ ఆటోమోబైల్ దిగ్గజం ఎంజీ కంపెనీ ఆస్టర్ మోడల్‌ను అక్టోబర్ 11 వ తేదీన ఇండియాలో రిలీజ్ చేసింది. అక్టోబర్ 21 వ తేదీన ఎంజీ అస్టర్ మిడిల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి ప్రీబుకింగ్‌ను ప్రారంభించింది.
అయితే ఈ ప్రీ బుకింగ్‌ను ప్రారంభించిన 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల కార్ల బుకింగ్ జరిగినట్టు MG INDIA ప్రకటించింది. ఈ కార్లపై మోజు ఉన్నవారు.. ఇప్పుడు బుక్ చేసుకున్న 5 వేల కార్లను వచ్చే ఏడాది నవంబర్, 2021 నుంచి వినియోగదారులకు అందజేస్తామని ఎంజీ కంపెనీ తెలిపింది. మరియు ఇదే మోడళ్ల కార్ల కావాలంటే మాత్రం.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. Mg (ఎంజీ ఆస్టర్ మిడిల్) సైజ్ ఎస్యూవీ ధర ఇండియాలో రూ.7.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటుంది. ఇండియాలో కరోనా తరువాత ఈ స్థాయిలో కార్ల బుకింగ్ జరగడం మరో విశేషంగా చెప్పవచ్చు.
కారు ప్రత్యేకతలు: ఇండియాలో ఎంజీ 1.3 లీటర్ టర్బో ఇంజిన్ పెట్రోల్(ZDS) ZS పెట్రోల్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనిలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటో ఎసి, మరియు హెక్టర్ మరియు ZSVలలో కనిపించే విధంగా కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఉన్నాయి.
MG Motor had started accepting bookings for its Astor SUV in India earlier today and within a short span, the first batch of 5,000 cars has sold out. Deliveries of the models booked today will start from November 1 onwards. #MGAstorhttps://t.co/Wx0xecoICy
— NewsBytes (@NewsBytesApp) October 21, 2021