మరో ఖరీదైన విడాకులు: 5లక్షల కోట్లు

మెక్రోసాఫ్ట్ అధినేత దంపతులకు విడాకులు
బిల్ గేట్స్ పెళ్లైయి 27ఏళ్లు
ఆస్తుల పంపకాలపై క్లారిటీ ఇవ్వని కోర్టు
భరణం 5 లక్షల కోట్లు ఉండే ఛాన్స్
మెక్రోసాప్ట్ అధినేత, బిలియనీర్ బిలిగేట్స్ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. అమెరికాలోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో గత కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారు కోర్టును ఆశ్రయించగా విడాకుల పత్రాలపై సంతకాలు చేశారు. 1987లో మైక్రోసాఫ్ట్ అధినేత బిలిగేట్స్ తో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ కు పరిచమైంది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి 1994లో పెళ్లి చేసుకున్నారు. బిల్స్ గేట్స్ వివాహం అయి 27 ఏళ్లు అయింది.
అయితే ఈ ఏడాది మేలో విడిపోతున్నట్లు బిల్గేట్స్ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ప్రకటించారు. మా బంధం విడిపోతున్నపట్టకీ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్లో ఎటువంటి మార్పులుండవని బిలిగేట్స్ తో కలిసి పని చేస్తామని మెలిందా ఫ్రెంచ్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మెలిందా కలిసి పనిచేయని భావిస్తే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ కో–చైర్, ట్రస్టీగా రాజీనామా చేస్తారని ఇటీవలే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
బిల్ గేట్స్ సంపదలో 50శాతం భార్యకు ఇచ్చే అవకాశం ఉంది. బిల్ గేట్స్ ఆస్తి ప్రస్తుతం 10 లక్షల కోట్లు దాకా ఉంది. ఇందులో 5 లక్షల కోట్లు వరకూ మిలిందా గేట్స్ కు ఇచ్చే అవకాశముందని అంటున్నారు.