పుదీనాతో మీ ఆరోగ్యం..

పుదీనాతో మీ ఆరోగ్యం..

పుదీనాతో మీ ఆరోగ్యం..

పుదీనాలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీని ఆకులు సంవత్సరం పొడవునా ఆకుపచ్చగా ఉంటాయి. పుదీనా మొక్క ప్రతి భాగం ఉపయోగపడేదే.. ఔషధతత్వాలు కలిగి ఉన్నదే.. అయితే దీని లాభాలేంటో చూద్దామ మరీ..

పుదీనా ఆకులు,  కాండాలతో సహా అన్ని రోగాలకు మంచి మందుగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో ఈ పుదీనాకు మంచి విలువలున్నాయి. ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స్  కంపెనీల్లో, బబుల్‌ గమ్స్‌ తయారీలో, ఔషధాల్లో .. మరి కొన్ని ఉత్పత్తుల్లో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది. క్రిమి సంహారక గుణాలు కూడా ఇందులో పుష్కళంగా ఉన్నాయి. కనుకనే, దీనిని భారత్ సహా అన్ని దేశాల్లో  ప్రజలు అత్యధికంగా వాడుతున్నారు.

పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అలర్జీని, ఉబ్బసాన్ని దూరం చేస్తుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకే వంటకాల్లో పుదీనాను వాడుతూ ఉండాలని చెబుతున్నారు. అందుకే పుదీనా తరచూ కూర లేదా పచ్చళ్లలో పుదీనా ఆకులను వేస్తే మంచి టేస్టు వస్తుంది. పుదీనాను తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో ఓ లుకేద్దాం రండి…!

వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశింపజేయవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు.

పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీని దూరం చేస్తాయి. పుదీనా ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి.

పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది. పుదీనా ఆకులను లోషన్లు, సుంగంధ ద్రవ్యాలతో పాటుగా షాంపూల తయారీలలో ఉపయోగిస్తారు.

పుదీనా నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. పుదీనా శృంగారానికి ఉపయోగపడే  మంచి ఔషధం. సాంప్రదాయ వైద్యంలో పుదీనా ప్రధానంగా కడుపు మరియు చెస్ట్ ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. పుదీనాతో కాలిన గాయాలను చోట రాస్తే పుండ్లు మానతాయి. పుదీనాతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లబడతాయి.

మిఠాయిని కుకీలు, చాక్లెట్లు, స్నాక్స్, క్యాండీలు మరియు చూయింగ్ చిగుళ్ల ఉత్పత్తికి మిఠాయి పరిశ్రమలో ఉపయోగిస్తారు. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో  పుదీనా ఆకులు బాగా వాడతారు. మిరియాల పొడి, నల్ల ద్రాక్ష, జీలకర్ర, సింధు, గసగసాలు… వీటన్నింటినీ కలిపి తీసుకుంటే… జీర్ణక్రియ మెరుగవుతుంది.

కడుపులో నొప్పితే బాధపడేవారు పుదీనా ఆకుల రసం, తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది. టైఫాయిడ్ నుంచీ ఉపశమనం పొందాలంటే… పుదీనా ఆకులు, తులసి ఆకుల రసం కలిపి తాగాలి.

కలరా సమస్య ఉంటే… నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే… ఫలితం ఉంటుంది. జలుబుతో ముక్కు కారుతూ ఉంటే… పుదీనా ఆకుల రసం నాలుగు చుక్కల్ని ముక్కులో వెయ్యాలి. వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.

ముఖం కాంతివంతంగా మారాలంటే… పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి… గుజ్జులా చేసి… ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి… గంట తర్వాత నీటితే కడిగేసుకోవాలి.

సో.. ఈ విధంగా ట్రై చేయండి.. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *