తెలంగాణలో ఆసక్తి రేపుతున్న MLA ఎన్నిక

తెలంగాణలో ఆసక్తి రేపుతున్న MLA ఎన్నిక
అందరి చూపు హుజురాబాద్ వైపే..?
హుజురాబాద్ ఎన్నికలో గెలుపు ఎవరిది..?
ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది.
వచ్చే నెలలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాబోయే రెండు, మూడ్రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ హుజూరాబాద్ ఉప ఎన్నిక.. దీంతో రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీ తరుపున ఇప్పటికే ఈటల బరిలో ఉండగా..టీఆర్ఎస్ తరుపున బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. హుజూరాబాద్ లో టీఎర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ మంత్రులు, నేతలకు బాధ్యతలు అప్పగించారు. గెలుపు కోసం వారి ఆధ్వర్యంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అయితే ఇదే క్రమంలో ‘దళిత బంధు’ పథకాన్ని నియోజకవర్గంలోని అర్హులైన దళితులందరికీ అమలుచేసేందుకు టీఎర్ఎస్ సర్కార్ సిద్ధమైంది. గత 7 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ప్రచారం చేసుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది. గెలుపు దిశగా ఎమ్మెల్యే ఎన్నికల కోసం వాడుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ రంగుతో కూడిన లేఖలు రాయాలని నిర్ణయించింది. దాదాపు రెండు లక్షలకు పైగా లేఖలను ముద్రించి.. నియోజకవర్గంలోని కార్యకర్తల ద్వారా ఉపాధి పథకాలు పొందిన వారితో పాటు ఓటర్లకు పంచాలని చూస్తోంది. అయితే తాజాగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలనూ లేఖల్లో ముద్రించి.. సీఎం కేసీఆర్ పర్యటన కంటే ముందే.. నియోజక వర్గంలోని అందరి ఓటర్లకు వాటిని పంపిణీ చేసేలా పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విదేశీ విద్యానిధి తదితర పథకాల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతోపాటు నియోజకవర్గంలోని ఇతర కుటుంబాలకూ వాటిని పంపాలని నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది ఎదురు చూడాల్సిందే మరీ..