మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు 40శాతం మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు,నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, మనోజ్, మంచు లక్ష్మి, సుమ, శ్రీకాంత్, నరేశ్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర్, నటి రాశి, సాయి కుమార్, రాఘవతోపాటు పలువురు సీనియర్ నటీనటులు ఓటు వేశారు.
మీడియాకు మంచి మెటీరియల్ దొరికింది కదా..? చిరంజీవి
‘మా’ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. పరిస్థితులు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు అని ఆయన అన్నారు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. మీ మీడియాకు మంచి మెటీరియల్ దొరికింది కదా అని హాస్యాస్పదంగా అంటూ…ఈ నేపధ్యంలో మీడియా ఆనంద పడాలి కదా.. అని చమత్కరించారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికేద నా మద్ధతు అని చెప్పుకొచ్చారు.
ప్యానల్ కు పోటీ పడుతున్న ఇద్దరూ అన్నదమ్ముళ్ల లాంటి వారే.. బాలకృష్ణ
మా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బాలకృష్ణ మీడియాతో ఇలా అన్నారు. ఎవరైతే ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఆ ఇద్దరూ సినీ పరిశ్రమ బాగుగోలు చూస్తారన్న నమ్మకం ఉంది. అందుకే వారికే ఓటేశా..! దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. తమ్ముడు విష్ణు, ప్రకాశ్ రాజ్ లు చిత్రపరిశ్రమకు అన్నదమ్ముళ్ల లాంటి వారే.
వీరివురు మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు మేమంతా షూటింగ్లలో కలిసీ పని చేసుకునే వాళ్లమేనని బాలయ్య జోస్యం చెప్పారు. మా సభ్యులకు ఎలాంటి అవసరాలున్నావారికి సహాయ సహాకారాలు అందించే బాధ్యత మా ఎన్నికల్లో గెలిచిన సభ్యులదే కాదని… చిత్ర పరిశ్రమలోని అందరిపై ఆ బాధ్యత ఉందని బాలయ్య తెలిపారు.
మా ఎన్నికలపై పవన్ స్పందించిన నేపథ్యంలో.. ఓటు వేసిన పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులని ఆయన అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదన్నారు. సినీ నటులందరూ ఒకరి అభిప్రాయలు ఒకరిని గౌరవించుకునేలా ఉండాలని ఆయన అన్నారు. ఈ ఎన్నికల వల్ల చిత్ర పరిశ్రమ చీలిపోదని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన సాయి కుమార్.. నేను కూడా పోటీ చేయాలనుకున్నా కానీ.. షూటింగ్లో బిజీగా ఉండడంతో పోటీలో లేనని చెప్పకొచ్చారు సాయి కుమార్. మా ఎన్నికలు సాధారణ ఎన్నికల స్థాయిలో జరుగుతున్నాయని అన్నారు. మా అధ్యక్ష పోటీలో ఎవరు గెలిచినా.. `మా` గెలిచినట్లేనని చెప్పిన సాయి కుమార్.. నేను లోకల్, నాన్ లోకల్ కాదని నేషనలిస్ట్ అని హాస్యస్పదంగా కితాబిచ్చారు సాయికుమార్.
నరేష్: పోలింగ్ జరిగే విధానం బాగుందని ఉదయం 9 గంటలకే 30శాతం పోలింగ్ పూర్తయింది. చాలామంది ఓటు వేసేందుకు వస్తున్నారని.. ఈసారి 500 మందికి పైగా ఓట్లు వేస్తారని అనుకుంటున్నాని అన్నారు. పోయిన సారి ఎన్నికల్లో 457 మంది మాత్రమే ఓటేశారు.
నటి రాశి: ప్యానెల్స్ ఏం చెప్పాయో నాకు తెలియదు కానీ, మేనిఫెస్టోలు ఏంటనే దానిపై నేను స్పందించను. ఓటు వేయడం నా హక్కు..అందుకే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నానని ఆమె తెలిపారు.
కాసేపు పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత
‘మా’ పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నమూనా బ్యాలెట్ ఇస్తున్న సినీయర్ నటుడు శివారెడ్డిని..నటుడు శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య పరస్పర దూషణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆ సభ్యులను పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.