ఈ జ్యూస్‌ను రోజూ తాగండి…అలవోకగా బరువు తగ్గిపోతారు..!

ఈ జ్యూస్‌ను రోజూ తాగండి…అలవోకగా బరువు తగ్గిపోతారు..!
ప్రకృతి దేవత మనకు ఇచ్చిన ఎన్నోరకాల మొక్కలలో మునగ చెట్టు ఒకటి. మునగ చెట్టు ఆకులతో మనం బరువు తగ్గొచ్చు..? చాలా మంది బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో విధాలుగా బరువుతగ్గాలని ట్రై చేస్తుంటారు.
దీనికోసం ఎన్నో రకాల మందులు, ఎన్నో రకాల టాబెలెట్లు వాడుతుంటారు చాలా మంది మునగకాయలను సాంబారులో లేదా కూరగా వేసి వండుకుని తింటుంటారు. కానీ నిజానికి మునగకాయల కన్నా మునగాకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. మనగాకు అనేక అనారోగ్యాలను తరిమికొడతాయి.
ప్రతిరోజు ఉదయాన్నే మునగాకుల ఒక కప్పు మోతాదులో జ్యూస్‌ను రోజూ పరగడుపునే సేవించడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా మరీ.
అధిక బరువు, ఊబకాయం ఉన్న ప్రతిఒక్కరికి మునగాకుల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ మునగాకుల జ్యూస్‌ను పరగడుపునే తాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ అధికశాతంలో ఉంటే ఈ జ్యూస్ భలేగా పనిచేస్తుంది.
మునగాకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి.ఈ మునగాకు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలువరిస్తాయి. మనకు ఏ క్యాన్సర్లు అయినా దరిచేరవు. యాక్టివ్‌గా ఉండేందుకు మునగాకు రసం ఎంతోగానో ఉపయోగపడుతుంది. దీంతో చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది.
మానవ శరీరంలో రోజూ విష పదార్థాలు, వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. వాటిని బయటకు పంపేందుకు మునగాకుల జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం కడిగేసినట్లు అంతర్గతంగా క్లీన్ అవుతుంది. శరీరం సౌకర్యవంతంగా, హాయిగా, లైట్‌గా అనిపిస్తుంది. అందువల్ల రోజూ మునగాకుల జ్యూస్‌ను తాగాలి.
A విటమిన్ లోపం ఉన్నవారు ట్యాబ్లెట్లను వాడాల్సిన పనిలేదు. మునగాకులలో విటమిన్ A అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది.
మునగాకు జ్యూస్ తాగితే జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మునగాకు జ్యూసు త్రాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గి కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మెడ, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రోజూ మునగాకుల జ్యూస్‌ను తాగుతుంటే చక్కగా నిద్ర పడుతుంది. గాఢ నిద్రలోకి జారుకుంటారు.
మునగాకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి.
మునగాకుల జ్యూస్‌ను రోజూ తాగితే శరీరానికి ప్రోటీన్లు, కాల్షియం లభిస్తాయి. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది. వృద్ధులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
వంద గ్రాముల మునగాకులో ఏమేం పోషకాలుంటాయంటే..
మాంసకృత్తులు: 8.3 గ్రాములు
కాల్షియం: 434 మిల్లీగ్రాములు
పొటాషియం: 202 మిల్లీగ్రాములు
విటమిన్ ఎ: 738 మిల్లీగ్రాములు
విటమిన్ సి: 164 మిల్లీ గ్రాములు
పీచుపదార్థాలు: 19.2 గ్రాములు
మునగ భారత్‌లోనూ, అనేక ఆఫ్రికన్ దేశాల్లోనూ ఎదుగుతుంది. పశ్చిమదేశాల్లో మునగ బ్రతకదు. భారత్ నుంచి వచ్చే మునగాకు శ్రేష్ఠమైనది. అందుకే భారత్ నుంచి మునగ ఆకును అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, చైనా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో దీనికోసం ఎగబడుతున్నాయి. అక్కడ మునగాకు పొడికి చాలా డిమాండ్ ఉంది. అందుకే మునగాకు కనిపడితే చెట్ల పచ్చి ఆకులను తెంపుకొని కొంతమంది తింటుంటారు.