దిడెవిల్ ఈజ్ బ్యాక్ తో “బంగార్రాజు” న్యూ లుక్ తో పోస్టర్

దిడెవిల్ ఈజ్ బ్యాక్ తో “బంగార్రాజు” న్యూ లుక్ తో పోస్టర్

దిడెవిల్ ఈజ్ బ్యాక్ తో “బంగార్రాజు” న్యూ లుక్ తో పోస్టర్

సంచలన సినిమాలు తీసి సినీ ఇండస్ట్రీలోనే మంచి పేరుతెచ్చుకున్న నటుడు అక్కినేని నాగార్జున..ఆయన బర్త్ డే వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా (ఆగస్టు 29న) ఘనంగా జరుపుకున్నారు అభిమానులు. అయితే అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా రాబోయే కొత్త చిత్రాలకు సంబంధించిన నాగ్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ది గోస్ట్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆ తరువాత బంగార్రాజు చిత్రం పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్

అయితే 2016లో సోగ్గాడే చిన్ని నాయన అనే చిత్రం ప్రేక్షకులు, అభిమానుల ఆదరణ పొందింది. అయితే ఇదే సినిమాకు ప్రిక్వేల్ గా ఈ బంగార్రాజు సినిమా తెరకెక్కనుంది. అయితే వైల్డ్ డాగ్ లో నాగ్ చివరిసారిగా కనిపించారు. అయితే తనయుడు నాగ చైతన్యతో కలిసి నాగార్జున బంగార్రాజు చిత్రంలో మరోసారి ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. మనం చిత్రం తరువాత ఈ సినిమా రెండో సినిమాగా తెరకెక్కబోతుంది.

అయితే ఆగస్టు 20న హైదరాబాద్ లో బంగార్రాజు పూజ కార్యక్రం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్లు రమ్యకృష్ణ, కృతిశెట్టి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించబోతున్నారు.

బంగార్రాజు లో నాగచైతన్య ప్రేయసిగా కృతి శెట్టి నటించనుంది చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టెర్ అనూప్ రూబెన్స్ స్వరాలు అందించనున్నారు. ఈ చిత్రం తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై జీస్టోడియో సహకారంతో నాగార్జున బంగార్రాజు చిత్రాన్ని నిర్మించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *