అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయనున్న కింగ్

అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయనున్న కింగ్

అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయనున్న కింగ్ నాగార్జున

డైరెక్షర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోందని..ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌ బయటకు వచ్చింది. అఫిషీయల్ గా ఈ 29న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని.. అయితే ఈ సందర్భంగా ప్రీ-లుక్‌ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్ లో నాగ్ వర్షంలో కత్తి పట్టుకుని ఉన్న మూడ్ ని చూస్తుంటే.. హాలీవుడ్ లెవెల్ లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ ఇండియాలోని ప్రధాన నగరాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ జరగనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో కింగ్ నాగార్జున సరసన కాజల్‌ అగర్వాల్‌ సందడి చేయనున్నారు. నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నప్పటికీ..కోవిడ్ భయంతో ప్రజలు థియేటర్లకు రావడం లేదని.. ఈ సినిమా ఓటీటీలో వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని.. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *