National-film-awards: తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

National-film-awards: తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

జాతీయ చలనచిత్ర అవార్డుల పంట… తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

సినీ తారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు..ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‏లో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. 2021 మార్చి 23న ఈ అవార్డుల అనౌన్స్ చేశారు. కరోనా కారణంగా ఆరు నెలలు వాయిదా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అయితే ఈ అవార్డుల ప్రకటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వినగానే ఆడిటోరియంలోని అభిమానులతో పాటుగా, సినీ స్టార్లు, పెద్దలు అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ వేడకకు సినీ రంగంలో ఉత్తమ చిత్రాలకు, పులువురు నటీనటులు, అవార్డులు అందుకున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్ఛేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సూపర్ స్టార్ రజనీ కాంత్ అందుకున్నారు.

రజినీ జీవితం: సినీ ఇండస్ట్రీలో కేవలం హీరోగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా సినీ పరిశ్రమలో రజినీ నిజంగానే సూపర్ స్టార్..ఇప్పటికీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తలైవాతో సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.

ఈ సందర్భంగా తలైవా..ఓ శాలువా కప్పుకొని కురతా పైజా వేసుకొని వచ్చారు. ఆ స్టేజ్ మీద ఉన్న అందరిని ఆకట్టుకుంది. తన 45 ఏళ్ల సినీ ప్రస్తాన్ని ప్రస్తావించారు. తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తన అవార్డును తన అన్నయ్య సత్యనారాయణ గైక్వాడ్, గురువు బాలచందర్, నా స్నేహితుడు రాజ్ బహద్దూర్ కు అంకితమిస్తున్నాని ప్రకటించారు.

ఉత్తమ నటులు: భోంస్లే చిత్రం: మనోజ్ పాయ్, అసురన్ చిత్రం: ధనుష్

మణికర్ణిక చిత్రం: కంగనా రనౌత్, బెస్ట్ ఫీచర్ ఫిల్మిం: మరక్కర్ (మలయాళం)

ఉత్త‌మ తెలుగు చిత్రం: జెర్సీ, రెండు అవార్డులు

ఉత్త‌మ పాపుల‌ర్ చిత్రం: మ‌హ‌ర్షి, మూడు అవార్డులు

ఇంకో విశేషమేమిటంటే ఒకే ఏడాది రజినీకాంత్..అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడానికి రజినీకాంత్ భార్య, కూతురు ఐశ్వర్య.. అల్లుడు ధనుష్ హజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: