OTT లపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ

OTT ల్లో వచ్చే సెక్సువల్ కంటెంట్, అభ్యంతరకర వీడియోలకు ఇక చెక్ పడనుంది. సోషల్ మీడియా, OTT కంటెంట్స్ పై ఎథిక్స్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సినిమాలకే ఉన్న పరిమితులను ఇకపై OTT లకు కూడా వర్తింపచేయనున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత OTT లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. గతంలో Amazon Prime, Net Flex, Sun Next, Hot star లాంటి OTT లు పాపులర్ గా ఉండేవి. కానీ లాక్ డౌన్ తో జనం ఇళ్ళకే పరిమితి అవడంతో వీటి వాడకం పెరిగింది. అదే టైమ్ లో కొత్త కొత్త OTT ప్లాట్ ఫామ్స్ పుట్టుకొచ్చాయి. వీటిల్లో సెక్సువల్ కంటెంట్ కూడా పెరిగిపోయింది. సినిమాలకైతే సెన్సార్ బోర్డు ఉండటంతో విచ్చలవిడిగా సెక్సువల్ కంటెంట్ చూపించడం కుదరదు. దాంతో చాలామంది దర్శక నిర్మాతలు, ఔత్సాహికులు వెబ్ సిరీస్ ల్లో వీటిని చొప్పించడం స్టార్ట్ చేశారు. కేవలం ఇదొక్కటే కాదు… ఇతరుల మనోభావాలను రెచ్చగొట్టే కంటెంట్ ను కూడా OTTల్లో చూపిస్తున్నారు. దాంతో ఆ మధ్య డర్టీ హరీతో పాటు హిందీలోనూ కొన్ని వెబ్ సిరీస్ లపై జనం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇవి ఎలా తయారయ్యాయంటే… దేశం భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలను కూడా ఆఖరికి దర్శక, నిర్మాతలు తప్పుబట్టే స్థాయికి వెళ్ళిపోయాయి.
ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనక్కర్లేదు. అదికో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఉంటున్నాయి వీటిల్లో వచ్చే పోస్టులు. ఆ మధ్య మూకదాడులకు సంబంధించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవడంతో… కోర్టులు, పోలీసుల జోక్యంతో అలాంటి రూమర్స్ కి కాస్త బ్రేక్ పడింది. కానీ ఇంకా అమ్మాయిలు, చిన్న పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. అంతెందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ బాలానగర్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కూలిందనీ, కొందరు చనిపోయారీ తప్పుడు మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేశారు కొందరు. పోలీసులు ఆ పోస్టులను సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. సోషల్ మీడియాలో ఇలా అడ్డూ అదుపూ లేకుండా పోతున్న రూమర్స్ కి కూడా చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎథిక్స్ కూడా మంచిదే.
OTT ల్లో కంటెంట్ కు అడల్ట్స్, చిల్డ్రన్స్ కంటెంట్ గా విడగొట్టడం… పెద్దలకు సంబంధించిన వీడియోలకు పేరెంట్ లాక్ పెట్టడం లాంటి చర్యలను మేథావులు, విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఆన్ లైన్ పాఠాలతో విద్యార్థుల దగ్గరే మొబైల్స్ ఉండటంతో వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.
మూడంచెల వ్యవస్థతో చెక్
అభ్యంతరకర, అసభ్య కంటెంట్ కు చెక్ పెట్టడానికి కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది
స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు
ఈ స్వీయ నియంత్రణ వ్యవస్థను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో రెగ్యులేటరీ బాడీ
ఈ రెండు అంచెల్లో కంటెంట్ ను నియంత్రించలేని పక్షంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ జోక్యం చేసుకుంటుంది.
ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా అభ్యంతరకర పోస్టులను సంస్థలు తొలగించాలి. 15 రోజుల్లోగా బాధితుల సమస్యలకు పరిష్కారాం చూపించాలి.
ఫేక్ మెస్సేజ్ లు మొదట పోస్ట్ చేసిన వ్యక్తులను గుర్తించాల్సిన బాధ్యత కూడా సోషల్ మీడియా నిర్వాహక సంస్థలపైనే పెట్టింది ప్రభుత్వం. మరి అందుకోసం సపరేట్ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే… ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతున్న ఈ ఫేక్ మెస్సేజ్ లను అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ ఎథికల్ కోడ్స్ ను సోషల్ మీడియా సంస్థలు, OTT ల నిర్వాహకులు పాటిస్తారో లేదో చూడాలి.