కర్ణాటక కొత్త కెబినెట్ ఏర్పాటు

కర్ణాటక కొత్త కెబినెట్ ఏర్పాటు
29మందితో కొత్త మంత్రుల ప్రమాణం
కర్ణాటక కొత్త కేబినెట్ ఏర్పాటు అయింది. నయా సీఎం బసవరాజు బొమ్మె ఎంపిక చేసిన 29 మంది రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
నయా మంత్రుల జాబితాలో యడ్డీ కుమారుడి పేరు లేకపోవడం కొంత అసహనానికి యడ్డీ గురయ్యారు. ముందుగానే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ చివరికీ ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు.
వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల వారీగా అనుభవం, కొత్త వారికి కేబినెట్ లో అవకాశం కల్పించాం.
8 మంది లింగాయత్‌లు, ఏడుగురు వొక్కలిగాలు, ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు దళితులు, ఒక ఎస్సీ, ఒక రెడ్డి సామాజిక వర్గ నేతలతో పాటు ఒక మహిళకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్టు చెప్పారు. కొత్త మంత్రుల పేర్లు రాజ్‌భవన్ అధికారికంగా విడుదల చేస్తుందని సీఎం తెలిపారు.