మార్కెట్ లోకి కొత్త సైకిల్స్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే…

ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ. ప్రయాణం
స్ట్రైడర్ సైకిల్స్ నుంచి 2 ఇ-బైకులు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోవడంతో వాహన వినియోగదారులు, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూవీలర్స్, కార్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాగా, కొంతమంది సైకిల్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సైకిల్స్ శారీరంగా, ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు చేస్తాయి. సగటు మానవుడ్ని దృష్టిలో పెట్టుకొని టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ స్ట్రైడర్ సైకిల్స్ అర్బన్ కమ్యూటర్స్ రెండు రకాల ఈ సైకిళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇవి బ్యాటరీ ఆధారంగా ఈ సైకిళ్లు నడుస్తాయి.
Tata Cycles Models: VOLTALK 1.7, (వోల్టాక్ 1.7) Kantino ETB 100 (కాంటినో ఈటీబీ 100) మోడళ్లను అందుబాటులోకి టాటా కంపెనీ ఈ మోడళ్ల తీసుకొచ్చింది. ఈ మోడళ్ల యొక్క ప్రారంభ ధర రూ.29,995 గా నిర్ణయించింది.
స్ట్రైడర్ వోల్టాక్ సైకిల్: 1.7లో 48వీ/260 డబ్ల్యూ మోటార్, మూడు గంటల్లో ఛార్జింగ్ అయ్యే 48వీ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు.
కాంటినో ఈటీబీ-100 సైకిల్: ఈ సైకిల్ లో 7 స్పీడ్లు, 3 రైడ్ మోడ్లు(ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెడల్), ఫ్రంట్ ఎల్ఈడీ దీపాలు, కీ లాక్డ్ బ్యాటరీ, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు వంటి స్మార్ట్ భద్రతా ఫీచర్లతో ఈ సైకిల్ ని రూపొందించారు.
అయితే ఈ సైకిళ్లను తొక్కుకుంటూ వెళ్లొచ్చు. మరియు బ్యాటరీ సదుపాయం కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఈ బ్యాటరీని చార్జింగ్ చేస్తే గరిష్టంగా 60 కిమీ ప్రయాణం చేయవచ్చు. స్మార్ట్ భద్రతా ప్రమాణాలతో వీటిని తయారు చేసినట్టు సదరు టాటా కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ చార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లవచ్చు. సైకిల్ లవర్స్ కి.. ఈ సైకిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.