ఓలాలో.. సరికొత్త ఫ్యూచర్..

ఓలాలో.. సరికొత్త ఫ్యూచర్..
వైకిల్ లవర్స్ ఎదురు చూపులు
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోరకాల ఎలక్ట్రానిక్స్ బైక్ లు వస్తున్నప్పటికీ బైకుల తయారీ విధానంలో “ఓలా” ఎలక్ట్రిక్స్ విన్నూత్నంగా ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ తయారు చేయని ప్రయోగాలు చేస్తుందండోయో అదేంటో చూద్దాం రండి…
ఆగస్టు 15 న ఓలా వైకిల్స్ ను లాంచ్ చేస్తున్నామని గతంలో తెలిసిన విషయం. ఓలా బైకును స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేయడం నాకు గర్వ కారణంగా ఉందని.. అయితే ఇప్పటికే మార్కెట్లో కొన్ని రకాల ఎలక్ట్రిక్ బైక్ లు ఉన్నప్పటికీ.. వాటికి ఇన్ని ఫ్యూచర్స్ లేవని, టూ వీలర్ రంగంలో ఓలా కు మాత్రమే ఈ ఫీచర్స్ ఉన్నాయని తెలిపారు. దీంతో బైకు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
ప్రి-బుకింగ్స్‌లో కూడా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ సంచలానాన్ని సృష్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే లక్షకుపైగా బైక్‌లు బుక్ అయ్యాయని అగర్వాల్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను ఎగబడిమరి ప్రి-బుకింగ్స్ చేసుకున్నారట.
తాజాగా భవీష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లును రిలీజ్ చేశాడు. ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లు..తయారీ విభాగంలో మరో సంచలనాన్ని సృష్టించనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ముందుకే కాదు వెనక్కి కూడా ప్రయాణించగలవని తన ట్విట్టర్ వేదిక ద్వారా ఓ వీడియోను భవీష్ అగర్వాల్ షేర్ చేశారు.