కొత్త బంకుల్లో ఇకపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్.. తప్పనిసరి..!
కొత్త బంకుల్లో ఇకపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్.. తప్పనిసరి..!
కేంద్ర ప్రభుత్వం ఇంధన సరళీకృత చర్యల్లో భాగంగా పెట్రోల్ పంప్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లను పెంచేందుకు చూస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం పెట్రోల్ పంప్ లైసెన్స్ నిబంధనల ప్రకారం..ఇకపై కొత్తగా పెట్రో బంక్ పంప్ ఇచ్చే ఇంధనేతర కంపెనీలకూ లైసెన్స్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఈ కొత్త ఇంధన రిటైల్ నూతన సరళీకృత విధానాల్లో కొత్త షరతులున్నాయి.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. రిటైల్ పెట్రోల్ బంక్ పంపుల అనుసరించి కనీసం 100 పెట్రోల్ బంకులు నెలకొల్పాలి తెలిపింది. ఇందులో 5 శాతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. అలాగే, కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ వంటి న్యూ జనరేషన్ ఇంధన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిబంధనల ప్రకారం మూడేళ్లలో రిటైల్ అవుట్ లెట్లలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపింది.