ఆ సుందర ప్రదేశంలో నైట్ కర్ఫ్యూ అమలు

ఆ సుందర ప్రదేశంలో నైట్ కర్ఫ్యూ అమలు
దేశ వ్యాప్తంగా ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో కరోనాతో పాటు కొత్త వేరియంట్లు వచ్చి ప్రభుత్వాన్ని గజగజలాడిస్తున్నాయి. అయితే దీనిలో కరోనా కేసులపై రాష్ట్రాలు దృష్టి పెట్టి వ్యాక్సిన్లు త్వరితగతిన వేసినా ఏ మాత్రం తగ్గడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. నివేదికలు, శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వాలు కార్యకలాపాలు నడిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా భారీ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో మరలా ఆంక్షలు మొదలయ్యాయి. నిబంధనలు పాటించకపోతే శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.
అయితే తాజాగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో నైట్ కర్ఫ్యూ ప్రస్తుతం అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు అస్సోం రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 8 గంటల వరకు షాపులు, రెస్టారెంట్లు, వాణిజ్య, సినిమా థియేటర్లు కూడా మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు తెరవకూడదని సర్కార్ ఆదేశించింది. అయితే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.