ఆంధ్రప్రదేశ్ లో మరో సారి రాత్రిపూట కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ లో మరో సారి రాత్రిపూట కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ లో మరో సారి రాత్రిపూట కర్ఫ్యూ

ప్రజలు 10 గంటల కల్లా ఇళ్లకు చేరుకోవాలి.

ఈనెల 21 వరకు ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్ లో మరో సారి రాత్రిపూట కర్ఫ్యూను పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 7 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయించింది. కరోనాతో పాటుగా కొత్త కొత్త వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా ఆంక్షలు యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఆగస్టు నెల 21వ తేదీ వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. షాపులు, మాల్స్  రాత్రి 9 గంటలకే మూసివేయాలని.. ప్రజలు 10 గంటలకల్లా ఇళ్లకు చేరుకోవాలని, కరోనా ప్రోటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా అమలులో ఉంటాయని..నిబంధనలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *