రాత్రిపూట నిద్ర పట్టడం లేదా..! ఈ చిట్కాలు పాటించండి

రాత్రిపూట నిద్ర పట్టడం లేదా..! ఈ చిట్కాలు పాటించండి

రాత్రిపూట కాఫీ,టీలు సేవించరాదు

గోరువెచ్చని పాలు త్రాగితే మంచిది

నిద్రించే ముందు మితాహారం మంచిది

బెడ్రూం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి

చాలా మందికి అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఆ టెన్షన్ లో రాత్రి సమయంలో నిద్ర పట్టకుండా ఉంటుంది. బెడ్ పై పడుకొని అటూ, ఇటూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ తో ప్రశాంతంగా నిద్రపోండి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. మనిషికి నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మనం బాగా ఆహారం తిని.. నిద్ర సరిగా పోకపోతే అధిక బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. గుండె జబ్బులు, డయాబెటిస్ తో పాటు అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రతిఒక్కరు లైఫ్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఈ ఒత్తిడిళ్లతోనే మానసిక సమస్యలకు లోనవుతూ నిద్రించే సమయాన్ని కోల్పోతున్నారు. కానీ మేము చెప్పేపద్ధతులు పాటిస్తే రాత్రి ఎంచక్కా బజ్జుకోవచ్చు.

నిద్రించే విధానం: రాత్రి పడుకునే ముందు ఓంకారం లేదా మనసుకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. లేదా మీకు నచ్చిన భగవంతుడి, సుందర దృశ్యాలను ఊహించుకోవాలి.

నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర పట్టదు. దీనివల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.  కొంద‌రు ప‌గ‌టి పూట బాగా నిద్రిస్తుంటారు.. దీనివల్ల కొవ్వు శాతం పెరిగే అవకాశాలుంటాయి.  అలా చేస్తే రాత్రి పూట నిద్ర ప‌ట్ట‌దు. క‌నుక సాధ్యమైనంత వరకు ప‌గటి పూట నిద్రించ‌కూడ‌దు. దీంతో రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.
ప‌గ‌టి పూట సూర్య‌కాంతి మ‌న శ‌రీరానికి బాగా త‌గిలితే మనకు ఎనర్జీ లెవెల్స్ శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. సో రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క‌నుక ఆ దిశ‌గా ప్రయ‌త్నిస్తే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌పోవ‌చ్చు.

బెడ్రూం ఎలా ఉండాలంటే: రాత్రి నిద్ర‌పోయే బెడ్ లేదా ప‌రుపు, దిండ్లు మీ శ‌రీరంపై ఒత్తిడి క‌లిగించ‌కుండా (మెత్తగా) చూసుకోవాలి.అంటే  చాలా సౌక‌ర్య‌వంత‌మైన బెడ్ అయితే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది.

నిద్రించే బెడ్‌రూంలో ప్రశాంతవంతమైన వాతావరణం, తక్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి. నీలి రంగు బెడ్ బల్పు పెట్టుకుంటే మరీ మంచిది. నీలి రంగు కాంతి వ‌ల్ల మ‌నం బాగా నిద్రిస్తామని అధ్యయనాల్లో తెలిసింది. అలాగే నిద్రించే బెడ్ రూమ్ లోకానీ, లేదా ఆయా ప‌రిస‌ర ప్రాంతాల్లో  ఎలాంటి శ‌బ్దాలు రాకుండా చూసుకుంటే చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

బెడ్రూం కొంద‌రికి చ‌ల్ల‌గా ఉంటే న‌చ్చ‌దు. కొంద‌రికి వేడిగా ఉంటే న‌చ్చ‌దు. ఇంకొంద‌రు ఎలాంటి ఉష్ణోగ్ర‌త ఉన్న గ‌దిలోనైనా నిద్రిస్తారు. అయితే ఎవ‌రికైనా స‌రిగ్గా నిద్ర ప‌ట్టాలంటే.. త‌మ‌కు కావాల్సిన ఉష్ణోగ్ర‌తలో గ‌ది ఉండేలా చూసుకోవాలి. ఆయా పరిసర ప్రాంతాలను బట్టి వారి అభిప్రాయం మేరకు ఏసీలు, కూల‌ర్లు వంటివి వాడొచ్చు. చ‌లికాలంలో సాధారణంగా అందరికీ పడదు. దీంతో చాలామంది నిద్రకు ఉపక్రమించే క్రమంలో ఇబ్బందులు పడతారు.. అయితే రూమ్ హీట‌ర్లు వాడోచ్చు.

ఆహార నియమాలు: సాధారణంగా ఆయుర్వేద, వైద్యులు చెప్పిన విధంగా రాత్రి పూట మితాహారం తీసుకుంటే మంచిది. ఆహారం ఎక్కువగా తీసుకుంటే రాత్రి పూట ఖర్చు అయ్యే అవకాశాలు తక్కువ.. మనకు అంతగా శక్తి అవసర ముండదు. ఆహారం తక్కువగా తీసుకుంటే చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది.. కొంతమందికి ఆహారం ఎక్కువ‌గా తీసుకుంటే నిద్ర త్వ‌ర‌గా పడుతుంది. కానీ సర్వేలలో మితాహారం తీసుకుంటే మంచిదని.. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుందని.. క‌నుక ఆహారాన్ని మితంగానే తీసుకుంటే మంచిదని అంటున్నారు.

రాత్రి పూట పెరుగు తినకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే జలుబు, శ్వాస సంబంధమైన వ్యాధులువచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  భోజనాంతరం నిద్రించే ముందు కనీసం రెండు, మూడు గంటలైనా గ్యాప్ ఉండాలి. కనీసం పది అడుగులైనా వేయాలి. భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు. ఎందుకంటే అరగుదల అవ్వడానికి జీర్ణ వ్యవస్థపై పడుతుంది.  నిద్రించే ముందు జ్యూసులు, నీరు ఎక్కువగా తాగరాదు. యూరినల్స్ కు లేవాల్సి వస్తుంది. ఎందుకంటే నిద్రాభంగం కలిగిస్తాయి.

నేటి  పెద్దలు, యువత మద్యానికి బానిస అవుతున్నారు. కానీ సర్వేలలో మాత్రం నిద్రించ‌డానికి ముందు మ‌ద్యం సేవించ‌రాదు. సేవిస్తే మ‌న శ‌రీరంలో కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫ‌లితంగా నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. క‌నుక మ‌ద్యం సేవించ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌.
కొన్ని సర్వేలలో రాత్రి పూట నిద్రించే ముందు కెఫీన్ ఎక్కువ‌గా ఉండే టీ, కాఫీలు తాగ‌రాదు. దీనివల్ల నిద్రకు అంత‌రాయం క‌లుగుతుంది. రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా ప‌ట్టాలంటే గోరువెచ్చని  గ్లాసు పాలు సేవిస్తే మంచిది.

నిద్ర పట్టకపోతే చిట్కాలు: రాత్రి నిద్రించే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉంటే మంచిది. అయితే జలుబు ఉంటే ఇలా చేయరాదు. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన ఎవరైనా చేస్తే ఇంకా మంచిగా నిద్రపడుతుంది. అయితే చాలా మందికి అరికాళ్ల మంటలు వస్తుంటాయి. ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే చాలా మంచిది. దీని ద్వారా తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉంది. సో……మేము చెప్పే చిట్కాలతో మీరు నిద్రిస్తారుగా మరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *