వార్తలు బాధాకరం….నిహారిక దంపతులు

వార్తలు బాధాకరం….నిహారిక దంపతులు

వార్తలు బాధాకరం….నిహారిక దంపతులు

త్వరలో  ఫ్లాట్ ను ఖాళీ చేస్తమంటున్న నిహారిక దంపతులు

వార్త పత్రికలు, మీడియాల్లో వార్తలు రావడంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య మేము అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకునేటప్పుడే ఆఫీస్ కోసమేనని ఓనర్ కి చెప్పామని  తెలిపారు. ఈ విషయంపై అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కు ఓనర్ చెప్పలేదని..దీనిపై అసోసియేషన్ వాళ్లు నాపై గొడవకు దిగారని చైతన్య వివరణ ఇచ్చారు. గొడవ జరిగిన నేపథ్యంలో ఫ్లాట్ ఖాళీ చేస్తమంటున్న నిహారిక దంపతులు.

ఇదే విషయంపై స్పందించిన అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. చైతన్య ఫ్యామిలీస్ ఉండే చోట అపార్ట్‌మెంట్‌ను కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్‌ కోసమని ఫ్లాట్‌ తీసుకున్న విషయం తమకు తెలియదని, దాంతో మా ఇరువురి మధ్య వాదన జరిగినట్లు తెలిపారు. అయితే చైతన్యతో సహా, అసోసియేషన్ సభ్యులంతా  కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ వివరించారు.

అయితే ఇదే విషయంపై బంజరాహిల్స్ పీస్ లో అపార్ట్‌మెంట్‌ వాసులు  చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్‌మెంట్‌ వాసులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

గత కొద్ది రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా చేస్తున్నట్లు, సృష్టిస్తున్నట్లు అపార్ట్‌మెంట్‌  వాసులు బంగాజారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో అపార్ట్‌మెంట్‌ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్‌ వాసులు భంగం కలిగిస్తున్నారని.. పీఎస్ లో కంప్లైట్ ఇచ్చాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపి ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా చైతన్యతో నిహారిక వివాహం డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *