నిహారిక భర్తపై అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు..?

నిహారిక భర్తపై అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు..?

అర్ధరాత్రి గొడవ, నిహారిక భర్తపై ఫిర్యాదు?

నిహారిక భర్తపై బంజారా పీఎస్ లో ఫిర్యాదు

ప్రముఖ స్టార్ డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో అపార్ట్‌మెంట్‌ వాసులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో గొడవ జరిగింది. దీంతో కంగారుపడ్డ అపార్ట్‌మెంట్‌ వాసులు వారింటికి వెళ్లగా చైతన్య వారి మీద కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లు తెలుస్తోంది.

అయితే ఇదే నిహారిక భర్త చైతన్య కూడా బంజరాహిల్స్ పీస్ లో అపార్ట్‌మెంట్‌ వాసులు తమ వ్యక్తిగత విషయాల్లో కలుగ చేస్తున్నారంటూ తిరిగి ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కాగా మెగా డాటర్‌ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం డిసెంబర్‌ 9న జరిగిన విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో పెద్దలు మందలించినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  నిహారిక భర్త మాత్రం… అపార్ట్ మెంట్ వాసులతో ఎలాంటి గొడవ లేదనీ… పోలీస్ కేసు ఏదీ పెట్టలేదంటున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *