మాస్క్ లేకపోతే రూ.1000 ఫైన్ ! బయటకొస్తే టీకా సర్టిఫికెట్ ఉండాలి !!

మాస్క్ లేకపోతే రూ.1000 ఫైన్ ! బయటకొస్తే టీకా సర్టిఫికెట్ ఉండాలి !!

ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటంతో దేశంలో మరోసారి ఆంక్షలు మొదలవుతున్నాయి. మాస్కులు మస్ట్ గా పెట్టుకోవాలంటున్నారు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ అధికారులు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న వెయ్యి రూపాయల ఫైన్ ను మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే ఈ ఫైన్ విధిస్తారు. ఇలాగే మళ్ళీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా విస్తరించే ఛాన్సుందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు.

బయటకొస్తే టీకా సర్టిఫికెట్ ఉండాలి

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటున్నారు వైద్యశాఖాధికారులు. ఫస్ట్ టీకా వేయించుకొని గడువు దాటిన ఇంకా సెకండ్ టీకా తీసుకోని వారు రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది GHMC పరిధిలోనే ఉండటం విచిత్రం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చదువుకున్న వారితో పాటు చైతన్యం కలిగిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అయినా వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఒమిక్రాన్ లాంటి వేరియంట్స్ విజృంభిస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందంటున్నారు వైద్యాధికారులు. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారిపై కాస్త తక్కువ ప్రభావం చూపించే ఛాన్సుంది. అయితే రాష్ట్రంలో వ్యాక్సిన్లు నిల్వలు కూడా బాగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ కు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు.

బయటకు వస్తే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వైద్య సిబ్బంది ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు… వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఫిజికల్ గా లేదా సాఫ్ట్ కాపీ రూపంలో అయినా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *