ఉక్రెయిన్ లో ఎన్టీఆర్, చరణ్ సరదా రైడ్

ఉక్రెయిన్ లో ఎన్టీఆర్, చరణ్ సరదా రైడ్

ఉక్రెయిన్ లో ఎన్టీఆర్, చరణ్ సరదా రైడ్

ఉక్రెయిన్‌ వీధుల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ సరదాగా సేదతీరుతున్న దృశ్యాలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఉక్రెయిన్ వీధుల్లో కారులో సరదాగా అలా రైడ్‌కు వెళ్లిన దృశ్యాలు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ కారులో తిరుగుతూ ట్రిప్‌ ను మరింత ఎంజాయ్ చేసేందుకు ‘దోస్తీ’ పాట వింటూ లిరిక్స్‌ హమ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని ‘RRR’ టీమ్‌ నెట్టింట్లో షేర్‌ చేసింది.

అయితే ఈవీడియోను అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యేలా చేశారు. మరోవైపు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘RRR’ నుంచి విడుదలైన ‘దోస్తీ పాట అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌- డైరక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘RRR’. అయితే ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్  కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌, తారక్‌ ప్రియురాలిగా ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ‘మేకింగ్‌’ వీడియో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుందని చిత్రయూనిట్ తెలిపింది.      ఏదీ ఏమైనా రాజ్ మౌళి చిత్రం అంటే అభిమానులలో ఓ భారీ అంచనాలు ఉంటాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *