ఆయిల్ పామ్ పంటలపై సబ్సిడి

ఆయిల్ పామ్ పంటలపై సబ్సిడి
రైతులను ఆదుకునేందుకు పథకాలు
ఆయిల్మ్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఆయిల్ పామ్ చేసే రైతులకు ఎకరాకు తొలి ఏడాది రూ.26వేలు, రెండో ఏడాది, మూడో ఏడాది ఎకరాకు రూ.5వేల చొప్పున పంట పెట్టుబడి ప్రొత్సాహకాన్ని సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. అధికంగా పంటలు పండించే వివిధ దేశాల్లో అధ్యయనం చేసేందుకు థాయ్ ల్యాండ్, కోస్టారియా ఇండోనేషియ, మలేషియాల్లో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి అక్కడి పంటల సాగుపై నివేదిక ఇవ్వాలని అక్కడి పండించే పంటలకు లాభసాటి ఎంత వస్తోందో తెలియజేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.