ఓలా ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ అమ్మకాలు వాయిదా.. 15 నుంచి

ఓలా ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ అమ్మకాలు వాయిదా.. 15 నుంచి

ఓలా ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ అమ్మకాలు వాయిదా.. 15 నుంచి

సెప్టెంబరు 8వ నుంచి ఓలా ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ ను అమ్మకాలను ఆన్ లైన్ లో అమ్ముతామని తెలిపిన ఓలా సంస్థ… కొనుగోళ్లకు వెబ్‌సైట్‌ సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో ఓలా విక్రయాలను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరు 15వ తేదీ నుంచి అమ్మకాలు ఉంటాయని ఓలా ప్రకటించింది. దీనిలో భాగంగా S1 అమ్మకాలు 7 రోజుల పాటు వాయిదా పడ్డాయి. గత నెలలో OLA S1, OLE S1 Pro ధరలను కంపెనీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ సందర్భంగా అక్టోబరులో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది.

ఓలా చైర్మన్‌, గ్రూప్‌ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ బుధవారం అర్థరాత్రి సమయంలో ట్విట్టర్‌ సందేశం ఇస్తూ అమ్మకాలు 7రోజుల పాటు వాయిదా వేస్తున్నామని, ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించనున్నామని ప్రకటించారు. కస్టమర్లకు వెబ్‌సైట్‌ లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలియచేశారు.

My message on the 

purchase issues today.

https://twitter.com/bhash/status/1435637094093778946?s=20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *