మార్కెట్ లోకి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్

ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ఫ్యూచర్స్ ఇలా ఉన్నాయి
S-1 ధర రూ.99,999, S1 Pro: 1,29,999
వాహన ప్రియులు ఎదురుచూసిన ఓలా ఎలక్ట్రిక్ బైక్ రానే వచ్చింది. కారు తరహా లక్షణాలతో ఎస్-1, ఎస్-1 Pro పేరు మీద రెండు ఎలక్ర్టిక్ స్కూటర్లు మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్నామని చైర్మన్ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఓలా ఫ్యూచర్లు అదిరిపోయేలా ఉన్నాయి. వేగం, ఛార్జింగ్, బూట్ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమైనదిగా నిలిచింది. ఈ కంపెనీ 10 రంగుల్లో మార్కెట్ లోకి అందుబాటులోనికి తెచ్చినట్లు చైర్మన్ భవిష్ అగర్వాల్ తెలిపారు.
మొత్తం 10 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటాయని.. స్కూటర్ల తయారీకి తమిళనాడులో 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న.. ప్లాంట్ ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్లాంట్‌పై రూ.2,400 కోట్లు పెట్టుబడి పెట్టామని ఈ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. వార్షిక సామర్థ్యం తొలుత ఏడాదికి 10 లక్షలు. ఆ తర్వాత క్రమంగా దాన్ని 20 లక్షలకు పెంచుతారు.
అయితే వాహనదారులకు అందుబాటులో ఉండేందుకు స్కూటర్‌తో పాటే ఒక పోర్టబుల్ చార్జర్ కూడా ఇస్తామని, దాన్ని ఇళ్లలోనే ఏర్పాటు చేసుకోవచ్చునని అగర్వాల్ తెలిపారు. తొలుత స్కూటర్‌ను అన్ని మార్కెట్లలో ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్లు పెట్టే వసతులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఓలా స్కూటర్లు షోరూమ్‌లలోనే కాకుండా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతామని చైర్మన్ భవిష్ అగర్వాల్ తెలిపారు.
OLA –S-1 : ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్-1 మోడల్ ధర రూ.99,999
S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది. గరిష్ట వేగం 90, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. ఎస్-1లో 7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్సెట్తో పనిచేస్తుంది. ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు. దీనిలో స్పెషల్ ఏంటంటే లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది. 3.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ పాటుగా 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
S1 Pro: 1,29,999
ఓలా ఎస్ 1 ప్రో ఎOLAలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది. అయితే లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు సృష్టించింది.
విద్యుత్ వాహనాలకు ఆకర్షణీయమైన రాయితీలిస్తున్న రాష్ర్టాల్లో ధర చాలా తక్కువగా ఉంటుందంటూ ఉదాహరణకి ఢిల్లీలో రూ.85,009, గుజరాత్లో రూ.79,000 ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆసక్తి గల వారికి ఆర్థిక సహా యం అందించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నామని, కనీస ఈఎంఐ రూ.2,999 నుంచి ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు.