ఒలింపిక్స్ లో 41 ఏళ్ల నిరీక్షణ, హాకీ విక్టరీ

ఒలింపిక్స్ లో 41 ఏళ్ల నిరీక్షణ, హాకీ విక్టరీ

ఒలింపిక్స్ లో 41 ఏళ్ల నిరీక్షణ, హాకీ విక్టరీ

ఉత్తంఠగా జరిగిన మ్యాచ్.. గెలిచిన టీమిండియా  

క్యాంసం గెలిచిన టీమిండియా

హాకీ విజయంతో జయహో భారత్ అంటూ అభిమానుల కోలాహాలం

హకీ జట్టుకు ప్రధాని ప్రశంసలు

దేశ ప్రజలంతా గెలుపు ఎప్పుడా అని ఎదురుచూస్తోంది.. అదేదో ఆట కాదండి హకీ.. మనదేశానికి హాకీ వెన్నెముక. ఎన్నో ఏళ్ల నుంచి భారత్ హాకీ విక్టరీ కోసం ఎదురుచూస్తోంది. ఒలింపిక్స్ మెన్స్ హాకీ పోరులో మన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా మ్యాచమయలో అదరగొట్టింది. జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో అద్భుతమైన విక్టరీ సాధించింది భారత్.

అయితే జర్మనీతో జరిగిన మ్యాచ్ లో క్షణం క్షణంగా ఉత్కంఠ పోరుతో గోల్స్ మధ్య  మ్యాచ్ జరిగింది. అయితే ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టినట్లు కనిపించింది. తొలి సెకన్ కే గోల్ కొట్టి లీడ్ లోకి దూసుకెళ్లింది జర్మనీ. తొలి క్వార్టర్ లో ఇండియా నుంచి ఎలాంటి గోల్ నమోదు కూడా చేయలేదు.

అయితే రెండో క్వార్టర్ 17వ నిమిషంలో సిమ్రన్ జిత్ తన చాక్యచక్యంతో  గోల్ కొట్టడంతో టీమిండియా ఖాతా తెరిచింది. తర్వాత 24వ నిమిషంలో రెండో గోల్ తో జర్మనీ లీడ్ లోకి దూసుకెళ్లింది. 25వ నిమిషంలో జర్మనీ మరో గోల్ నమోదు చేయడంతో రెండు జట్ల మధ్య గోల్స్ తేడా 3-1కి పెరిగింది.

అయితే తర్వాత దూకుడు పెంచిన ఇండియన్ ప్లేయర్స్…చివరి నిమిషాల్లో 17,27,29,31  వరుస గోల్స్  చేసింది టీంఇండియా. హర్మన్ ప్రీత్ వరుసగా గోల్స్ కొట్టారు. దీంతో సగం ఆట ముగిసే సమయానికి రెండు జట్లు చెరో మూడు గోల్స్ తో సమంగా ఉన్నాయి.


43 నిమిషంలో జర్మనీకి మూడు పెనాల్టి కార్నర్ లు దక్కగా..అద్భుతమైన డిఫెన్స్ తో మూడు పెనాల్టీ కార్నర్లను సేవ్ చేశారు ఇండియన్ ప్లేయర్లు. మూడో క్వార్టర్ లో ఇండియా రెండు గోల్స్ కొట్టగా..జర్మనీ ఒక్క గోల్ కూడా కొట్టి లేకపోయింది. ఇక మూడో క్వార్టర్ లో ఒక్క గోల్ కూడా కొట్టని జర్మనీ…నాలుగో క్వార్టర్ 48వ నిమిషంలో పెనాల్టి కార్నర్ సాయంతో నాలుగో గోల్ కొట్టింది.

దీంతో ఇండియా లీడ్ ను 4-5 తేడాకు తగ్గించింది. తర్వాత జర్మనీని మరో గోల్ కొట్టకుండా అడ్డుకోవడంతో ఇండియాకు కాంస్యం ఖరారైంది. దీంతో 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ హాకీ విభాగంలో భారత్ కు మెడల్ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *