ఇండియాలోకి ఒమిక్రాన్

ఇండియాలోకి ఒమిక్రాన్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసింది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చినట్టు గుర్తించారు. 46, 66 యేళ్ళున్న ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలను వేగంగా చుట్టేస్తోంది. ఫస్ట్ నాలుగు దేశాలకు పాకిన వైరస్… ఒకటి, రెండు రోజుల్లోనే 24 దేశాలకు విస్తరించింది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఇక జనం మళ్ళీ మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ల వాడకం మస్ట్ గా చేయాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *