భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకింది. అయితే వాళ్ళల్లో ప్రభావం తక్కువగానే ఉందనీ… స్వల్ప లక్షణాలే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో ఇప్పటిదాకా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఏవీ బయటపడలేదు. అయినప్పటికీ… అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయని చాలామంది టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు మరింత భయపెడుతున్నాయి. కరోనాలోని ఇతర వేరియంట్లకు different గా అయితే ఒమిక్రాన్ లక్షణాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం లాంటి కరోనా లక్షణాలే ఇందులో కూడా కనిపిస్తాయి. దక్షిణాఫ్రికాలో మాత్రం చాలామంది యువత తీవ్ర లక్షణాలతో హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళల్లో చాలా మంది ఒక్క డోసు టీకా తీసుకున్నవారు లేదంటే… అస్సలు వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళే ఉన్నారట. అందువల్ల ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే… ఇండియన్స్ అంతా రెండు డోసుల వ్యాక్సిన్ మస్ట్ గా తీసుకోవాల్సిందే. అవసరమైతే బూస్టర్ డోస్ కూడా రెడీ అవ్వాల్సిందే !!

బూస్టర్ డోసులకు రెడీ అవ్వండి !!

ఒమిక్రాన్ ప్రభావం భారత్ లో పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే హై రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ఎయిర్ పోర్ట్ ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది. మరోవైపు – కొత్త వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు జనానికి బూస్టర్ డోస్ వేయించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వైద్య నిపుణులు దీనిపై కేంద్రానికి సిఫార్సు చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ కూడా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ దేశంలో ఇంకా సెకండ్ డోసులు తీసుకోని వారు చాలామంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లంతా సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేయాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ఈ రెండూ పూర్తయితే బూస్టర్ వేసుకునే ఛాన్సుంటుంది. అలాగే కోట్లల్లో మిగిలిపోయిన సెకండ్ డోస్ టీకాలను బూస్టర్ డోసులు వేసుకునే వారి కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా కేంద్రం చేస్తోంది. దీనిపై వారం రోజుల్లోపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *