ఆన్లైన్ పేమెంట్ దారులకు RBI సరికొత్త రూల్..

ఆన్లైన్ పేమెంట్ దారులకు RBI సరికొత్త రూల్..
కొత్త రూల్ 2022, జనవరి 1 నుంచి అమలు
ఆన్లైన్ లో కొనుగోలు చేయాలంటే..
ఇకపై సీవీవీ ఒక్కటే సరిపోదు
ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారా…?, అటువంటి పేమెంట్ దారులను హెచ్చరించిన ఆర్బీఐ.. గతంలో ఆన్లైన్ లో ఏదైనా కొనుగోలు చేయాలంటే క్రెడిట్, డెబిట్ డిటేల్స్ ను చాలా మంది సేవ్ చేసి ఉంచుతారు. కొనుగోలు అవసరాలను బట్టి ఆయా సైట్లలో తమ డెబిట్, క్రెడిట్ కార్ల వివరాలను మొత్తం సేవ్ చేసి ఉంచుతారు. ఆ క్రమంలో డెబిట్, క్రెడిట్ కార్డు యొక్క CVV(సీవీవీ) ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఇలా చేయడం వల్ల వినియోగదారుడు ఒక్కోసారి మోసపోయే అవకాశము, సైబర్ నేరగాళ్ల నుంచి, మిస్ యూజ్ అయ్యే అవకాశం లేకపోలేదు.. అందుకే ఆర్బీఐ (RBI) ఈ నిబంధను తీసుకొచ్చిందని సమాచారం.
మీరు ఇకపై ఆన్లైన్లో ఏదైనా కొనుగులో చేయాలంటే ప్రతి ట్రాన్సాక్షన్‌కు వినియోగాన్ని బట్టి క్రెడిట్, డెబిట్ కార్డుల మొత్తం వివరాలు.. అంటే ఆయా కార్డులపై ఉండే 16 అంకెల కార్డు నెంబర్, సీవీవీ, మీ పేరు, కార్డు ఎక్స్పైరీ డేటు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ సవరించిన కొత్త నిబంధన ప్రకారం చేయాల్సిందే..
ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, గూగుల్, పేటీఎం, ఫోన్ పే పేలాంటి ఆన్లైన్ దిగ్జజ సంస్థల ప్లాట్‌ఫామ్స్ యూజర్ల డేటాను స్టోర్ చేయకూడదన్న ఉద్దేశంతోనే.. ఈ కొత్త రూల్‌ను తీసుకొస్తున్నామని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన రూల్స్ ప్రకారం 2022, జనవరి నుంచి దీనిని అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి.
అయితే కొనుగోలు దారుడు ఆన్ లైన్ లో ప్రతిసారీ కార్డు వివరాలు నమోదు చేయడం అనేది అంత సులువు కాదు కానీ.. దీని వల్ల ఏ బ్యాంక్ కస్టమరైనా యూజర్ల వివరాలు సురక్షితంగా ఉంటాయని ఆర్బీఐ అంటోంది. ప్రస్తుతానికి ఈ-కామర్స్ సైట్లు, పేమెంట్ గేట్వేలు ఆర్బీఐ సర్వర్లలో యూజర్ల డేటాను స్టోర్ చేసి అవసరమైనప్పుడు అందిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. ట్రాన్సాక్షన్ సమయంలో కేవలం సీవీవీ, ఓటీపీతోనే యూజర్ల పని చాలా వరకూ తగ్గిపోతోందని ఆర్బీఐ అంటోంది.