ఉల్లి పొట్టుతో సేంద్రియ ఎరువు త‌యారీ చేయడం ఎలా?

ఉల్లిగ‌డ్డ‌ పొట్టుతో సేంద్రియ ఎరువు త‌యారీ చేయడం ఎలా?

సాధారణంగా మనం ఉల్లి పాయను కోసిన తరువాత ఉల్లి పొట్టును పారేస్తుంటాం.. అయితే ఈ ఉల్లి పొట్టుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో చూద్దామా మరీ

ఉల్లి చేసిన మేలు త‌ల్లి కూడా చేయ‌లేదు అనే సామెత మన పూర్వకుల నుంచి వస్తున్న సంగతి అంద‌రికీ తెలిసిందే..అదే కాదు..ఈ ఉల్లిగడ్డ‌ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును ఎలా తయారు చేయాలో చూడండి.

ఉల్లిని త‌రిగిన త‌ర్వాత ఆ పొట్టును చెత్త‌డ‌బ్బాలో ప‌డేయ‌కుండా..జీరో బ‌డ్జెట్‌తో ఎరువును త‌యారు చేయొచ్చు ఉల్లి పొట్టులో ఐర‌న్, క్యాల్షియం, మెగ్నీషియం, కాప‌ర్ వంటి ఖ‌నిజాలు ఉల్లిగడ్డ‌ పొట్టులో పుష్క‌లంగా ఉన్నాయి. ఈ ఉల్లి పొట్టును సేంద్రీయ ఎరువుగా మార్చి మొక్క‌ల‌కు పిచికారి చేస్తే అవి ఎదుగుతాయి. మార్కెట్ల‌లో వేల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి ఎరువుల‌ను కొనాల్సిన అవ‌స‌రం లేదు.సేంద్రీయ ఎరువుతోనే మీ మొక్కలను పెంచుకోవచ్చు.

ఆర్గానిక్ ఎరువును తయారు చేయడం ఇలా

  1. ఉల్లిగడ్డను తరిగిన తరువాత ఉల్లి పొట్టును ఓ (సుమారు పావుకేజీ) మోతాదులో సేక‌రించాలి.
  2. ప్లాస్టిక్ డబ్బాలో లీట‌ర్ వాట‌ర్‌లో ఉల్లిపొట్టును వేయాలి.
  3. 24 గంట‌ల పాటు ఆ పాత్ర‌ను క‌వ‌ర్‌, మూత క‌ప్పి ఉంచాలి.
  4. అనంత‌రం ఆ పాత్ర‌లో ఉన్న మిశ్రమాన్ని వ‌డ‌క‌ట్టి.. నేరుగా మొక్క‌ల‌కు ఉప‌యోగించాలి.
  5. ఆ మిశ్రమాన్ని మొక్కలకు చల్లినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి.

ఊదా రంగులో ఉన్న ద్రావ‌ణాన్ని మొక్క‌ల‌కు పోయ‌డం వ‌ల్ల పుష్క‌లంగా పొటాషియం ల‌భిస్తుంది. ఈ ద్రావ‌ణాన్ని పెర‌డులోని మొక్క‌ల‌తో పాటు ఇత‌ర మొక్క‌లకు కూడా ఉప‌యోగించొచ్చు. ఇలా నెల‌లో క‌నీసం 3 నుంచి 4 సార్లు చేస్తే మొక్క‌లు ఎలాంటి చీడలకు గురికావు. ఇలా చేయడం ద్వారా మొక్కల సంక్షరణ చేసుకోవచ్చు. మొక్కలకు వెలుతురు ఉండేలా చూసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *