పాగ‌ల్‌ మూవీ ఎలా ఉందంటే..?

పాగ‌ల్‌ మూవీ ఎలా ఉందంటే..?

హీరో: విశ్వక్ సేన్ (ప్రేమ్)

హీరోయిన్: నివేదా హేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ, మురళీ కృష్ణ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు

నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా

నిర్మాతలు : జెక్కెం వేణుగోపాల్,

దర్శకత్వం:  నరేష్ కుప్పిలి

సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్

మ్యూజిక్ డైరెక్టర్: రథన్

విడుదల: ఆగస్ట్ 14, 2021

సేకండ్ వేవ్ కరోనా తరువాత రిలీజ్ అయిన చిత్రం పాగల్.. థియేట‌ర్ల ద‌గ్గర సంద‌డంతా ప‌రిమిత వ్యయంతో రూపొందిన సినిమాల‌దే. అగ్రస్టార్ ల చిత్రాలు రాకముందే ఈ చిన్నచిత్రాలు విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం చిన్న చిత్రాల జోరులో  భాగంగా విశ్వక్ సేన్ చిత్రం ప్రేక్షులన్నీ అలరిస్తోంది. అయితే టాలీవుడ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు.

మలయాళం, తెలుగులో హిట్ టూ క్రైమ్ థిల్లర్ సనిమాతో ప్రేక్షకుల మనసులను కొల్లకొట్టారు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తాజాగా నటించిన చిత్రమే ఈ చిత్రం పాగల్

ఈ చిత్రంలో కథానాయకుడు విశ్వక్ ప్రేమికుడిగా కనిపించడం.. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈసినిమాను సమర్పిస్తుండటంతో పాగల్ సినిమాపై.. పాజిటివ్ క్రియేట్ అయిందనే చెప్పాలి. దీనికి తోడుగా టీజర్, ట్రైలర్ ను గ్రాండ్ గా లాంఛ్ చేయడంతో ఈ పాగల్ సినిమాకు భారీగా అంచనాలు వచ్చాయి.

ఈ సినిమా కథ: అమ్మ అంటే నా ప్రాణం, ప్రపంచంలో తల్లిగా ఎవరూ ప్రేమించలేరని నమ్ముతాడు. 7 ఏళ్ల వయస్సులో తల్లి కోల్పోతాడు (విశ్వస్ సేన్) ప్రేమ్.. అమ్మ ప్రేమను పొందాలంటే అది అమ్మాయి వల్లే సాధ్యమవుతుందని.. తన ఫ్రెండ్ సలహానిస్తాడు. ప్రేమలో ఏమీ ఆశించకూడదని, తన తల్లి చిన్నప్పుడు చెప్పిన మాటలు ప్రేమ్ గుర్తుపెట్టుకుంటాడు..ఇది మనసులో పెట్టుకొని ప్రేమ్ ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. నన్ను ప్రేమిస్తే అమ్మలా చూసుకుంటానంటూ.. అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు. కానీ అందరూ ప్రేమ్ ప్రేమని తిరస్కరిస్తారు.

అయితే కొంత మంది అమ్మాయిలు ప్రేమ్ ని డబ్బుల కోసం వాడుకొని వదిలేస్తారు. ఇలా పలుమార్లు ప్రేమలో విఫలమైన ప్రేమ్ చివరకు రాజకీయ నాయకుడు రాజిరెడ్డి అలియాస్ రాజీ (మురళీ శర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించమని రాజీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పురుషుడైన రాజిని ప్రేమ్ ఎందుకు లవ్ చేశాడు..? ప్రేమ్ జీవితంలోకి (నివేతా పేతురాజ్) ఎలా వచ్చింది. తల్లి ప్రేమకోసం వెతికిన ప్రేమ్ కి ఎలా ప్రేమ ఎలా దక్కింది… అనేది ఈ చిత్రంలోని మిగతా కథ..

సినిమాపై అభిప్రాయం: ఈ చిత్రంలో తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం ఓ యువకుడి కథే పాగల్ చిత్రం.. మనం ఎవరిని ప్రేమించినా తిరిగి ప్రేమిస్తారు. అనే కానెప్ట్ తో ఈ సినిమా సాగుతుంటుంది.. ప్రేమ్ ఫస్టాప్ లో అంతా కామేడితో పర్వాలేదనిపించినా..సెకండాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ అభిమానుల ఓపికను పరీకిస్తోంది ఈ చిత్రం. క్లైమాక్స్ కూడా యావరేజ్ గా ఉంటుంది.

అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ రధన్ మంచి సంగీతాన్ని అందించారు. ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇకపోతే ఈ సినిమాలో ఎడిటర్ చేసిన విన్యాసాలు అలరించాయి కానీ.. ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. చిత్రంలో నిర్మాణ పనులు బాగానే ఉన్నాయి. ఏదీ ఏమైనా విశ్వస్ సేన్ ప్రేకక్షులు, అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని అనుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *