పాపం ఇమ్రాన్ ఖాన్ !

- ఇబ్బందుల్లో పాకిస్తాన్ ప్రధాని
- ఆదాయం లేక సతమవుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- పాకిస్తాన్ లో ఓ భవంతిని అద్దెకిస్తారు….
2018లో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థికంగా కుంగిపోయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు చేపట్టేందుకు ఖజానా ఖాళీ అయిందని అందుకే ఆర్థిక వనరులు లేక కష్టాలు పడుతున్నామన్న ప్రధాని. అందుకే ప్రధాని నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్ కెబినెట్ నిర్ణయించినట్లు అక్కడి మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.
2019లోనే ప్రధాని నివాసం యూనివర్శిటీగా మారుస్తారని ప్రధాని ప్రభుత్వం ప్రకటించినట్లు కథనాలు వొచ్చాయి. అయితే ఇప్పుడు ఆలోచనను విరిమించుకొందని తెలస్తోంది.
పాక్ ప్రధాని నివాసంలో అద్దెకు ఇచ్చేవి ఏమిటంటే.. ఆడిటోరియం, రెండ్ గెస్ట్ గదులు, ఒక లాన్. అయితే ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు నిర్వహించుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
కల్చరల్, ప్యాషన్, విద్యాపరమైన కార్యక్రమాలు జరుపుకునేందుకు ప్రధాని నివాసాన్ని అద్దెకు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించినట్లు పాక్ లో తెలుస్తోంది. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత మూడేళ్లలో పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైందని చెప్పొచ్చు. ఇమ్రాన్ పాక్ ప్రధాని అయిన తరువాత 16 బిలియన్లు పైగా పతనమవ్వడం అనేది సంశేషనల్ న్యూస్ గా మారింది.