పామాయిల్ సాగుకు కేంద్రం ప్యాకేజీ.. రూ.11వేలకోట్లు

పామాయిల్ సాగుకు కేంద్రం ప్యాకేజీ.. రూ.11వేలకోట్లు

పామాయిల్ సాగుపై కేంద్రం ప్యాకేజీ.. రూ.11వేలకోట్లు

పామాయిల్ సాగుకు హెకార్ట్ కు రూ.29వేల సాయం

5 హెక్టార్లలో సాగుకు రూ.కోటి వరకు సాయం

దేశ వ్యాప్తంగా పామాయిల్ సాగును పెంచే దిశగా కేంద్రం యోచిస్తుంది. అయితే “నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్” పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అదేవిధంగా దేశంలో పామాయిల్‌ ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్రం రైతులను ప్రొత్సహించేందుకు యోచన చేస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పామాయిల్ సాగును పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మిషన్ కింద రూ. 11,040 కోట్లు వెచ్చించిన‌ట్లు కేంద్ర‌ వ్యవసాయశాఖ‌ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దీనికి సంబంధించిన దస్త్రంపై సంతకాలు చేశారు.

అయితే దేశంలో పామాయిల్ సాగు తక్కువగా ఉన్నందున మనం ఉత్పత్తిని పెంచాలని యోచన చేస్తున్నట్లు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే 2025-26 నాటికి పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచాలని.. అదే 2029-2030 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచడ‌మే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం వల్ల మనం దేశీయంగానే నూనెల ఉత్పత్తి చేసుకోవడం ద్వారా మనకు కొరత తగ్గుతుందని మంత్రి అన్నారు. అయితే నూనెల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండడమే ఈ పథకం ఉద్దేశ్యమని అన్నారు.

అయితే బ్యాంకుల రుణాల ద్వారా పామాయిల్ సాగుకు హెకార్ట్ కు రూ.29వేల సాయం అందించనున్నామని తెలిపారు. పామాయిల్ ఆయిల్ విత్తన మొలకలపై కూడా కేంద్రం రాయితీ ప్రకటించింది. అయితే 5 హెక్టార్లలో సాగుకు రూ.కోటి వరకు సాయం అందించనున్నామని మంత్రి తెలిపారు. రైతు పండించిన ఆయిల్‌ ఫామ్‌ గిట్టుబాటు ధర కలిగేలా భరోసా ఇస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *