పన్నీర్ తో ఎన్నో లాభాలు !

కరోనా ఎటాక్ తర్వాత జనానికి పోషకాహారంపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అందుకే తమ ఆహారంలో ఎగ్ తో పాటు పనీర్ ను కూడా చేర్చుకున్నారు. ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటే పనీర్ తో వారంలో కనీసం ఒకటి, రెండు సార్లయినా వంటలు వండుకుంటున్నారు. 100 గ్రాముల పనీర్ లో దాదాపు 265 క్యాలరీల శక్తి ఉంటుందట. అలాగే 20 గ్రాముల ఫ్యాట్ కూడా ఉంటుంది. ప్రొటీన్స్ పుష్కలంగా ఉన్న పన్నీరు క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు హెల్త్ ఎక్ప్ పర్ట్స్.

  • ఒమెగా-3 యాసిడ్స్ పనీరులో ఫుల్లుగా ఉంటాయి. ఇది ఎముకలు, పళ్ళు గట్టిపడేందుకు దోహదపడుతుంది. ఎందుకంటే పనీరులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది
  • ఇన్సులిన్ అదుపులో ఉంచడంలో పనీర్ తోడ్పడుతుంది. ఇందులో లినో లెయిక్ యాసిడ్ అనేది ఉండటం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుందని చెబుతారు.
  • పనీరు అనేది డయాబెటీస్, బీపీ ఉన్న వారికి చాలా ఉపయోగం. ఇందులో ఉన్న పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె నొప్పులు వచ్చే అవకాశాలను చాలా మటుకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  • ముఖ్యంగా పిల్లలకు పనీర్ పదార్థాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెబుతారు. ఎందుకంటే ఇందులో ఇమ్యూనిటీ సిస్టమ్ ను డెవలప్ చేసే లక్షణాలు ఉన్నాయి.
  • పనీర్ తో స్కిన్ గ్లో కూడా వస్తుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *