నవంబర్‌ 7 నుంచి పాపికొండల్లో బోటింగ్‌…! 

ఆంధ్రప్రదేశ్ లో పాపికొండలు చాలా ముఖ్యమైన ప్రదేశం. దీన్ని చూడటానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. కరోనాతో ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ పర్యాటక ప్రాంతాలను తెరిచేందుకు  జగన్ ఆదేశాల మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పారు.

పాపికొండలలో గత కొన్ని నెలలగా బోటు ఆపరేటర్లు ఉపాధిలేక ఆందోళన చేస్తున్నారు. జీవనాధరం కష్టతరమైనది.. దీంతో బోటు ఆపరేటర్లతో పాటుగా టూరిజం, నీటి పారుదల శాఖ అధికారులతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.

దీనిపై ఓ ఓనిర్ణయానికి వచ్చిన మంత్రి అవంతి.. కరోనా ఆంక్షలతో  పాపికొండల్లో నవంబర్ 7 నుంచి బోటింగుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల ప్రకారం బోట్లలో ప్రయాణించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..భద్రతా ప్రమాణాలు కంపల్సిరిగా పాటించాలని మంత్రి బోటు యాజమాన్యాలకు ఆదేశించారు. గతంలో బోట్లు మునిగిన ఘటనలో జరిగాయి.. అవే పునరావృతం కాకుండా చూడాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.

పాపికొండలలో ప్రయాణించే బోటు ఆపరేటర్ల  కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో టూరిజం పరంగా పోలవరం అతిపెద్ద టూరిజం పాయింట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కూడా బోటింగుకు సహకరించాలని, బోట్లలో ప్రయాణించే పర్యాటకుల భద్రతే ప్రాధాన్యతగా పర్యాటక బోటులో నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా ప్రతి ప్రయాణికుడి అడ్రసు, సెల్ ఫోన్ నెంబర్ తీసుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా పశ్చిమగోదావరి వైపు నుంచి బోటింగుకు అవకాశాలపై పరిశీలిస్తామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *