గ్యాస్ ను ఇలా బుక్ చేస్తే గోల్డ్ గెలుచుకోవచ్చు
బంపార్ ఆఫర్: గ్యాస్ ను ఇలా బుక్ చేస్తే గోల్డ్ గెలుచుకోవచ్చు
దేశంలో రోజురోజుకి గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.15 పెంచారు. అయితే గ్యాస్‌ను బుక్‌చేసుకునే విధానంను బట్టి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి సంస్థలు. పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ వచ్చేది ఒకప్పుడు.. దీంతో పాటుగా తాజాగా క్యాష్‌బ్యాక్ ఆఫర్ కాకుండా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది పేటీయం. సదరు పేటీయం సంస్థ కొత్తగా ఆలోచన చేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఫోన్ పేను ఎక్కువగా వాడుతున్నారు జనం. కస్టమర్లను ఆకట్టుకునేందుకు పేటీయం ఒక ఆఫర్ ను ప్రకటించింది. పేటియం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి ఉచితంగా బంగారాన్ని సదరు సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ను దసరా, దీపావళి సంద్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారిని లక్కీ డ్రా ఎంపిక చేసి ఐదుగురికి 10001 విలువైన బంగారాన్ని అందిస్తారు. ఇది పేటీయం గోల్డ్ రూపంలో ఉంటుంది. ఈ గోల్డ్ బ్యాలెన్స్ ను విక్రయించి డబ్బు తీసుకోవచ్చు లేదంటే 10001 విలువైన బంగారం కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక మామూలుగా పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసిన వారికి 100 విలువైన స్క్రాచ్ కార్డును అందిస్తోంది. పండుగ సీజన్ల కొన్ని సంస్థలు ఈ ఆఫర్లను ప్రకటిచడం విశేంగా చెప్పొకొవచ్చు. అయితే ఆ అధృష్ట వంతులు ఎవరో వేచి చూడాల్సిందే మరీ.. మీ లక్క్ ను పరీక్షించుకోండి.