మా ఎన్నికల పై స్పందించిన పవన్ కళ్యాణ్

మా ఎన్నికల పై స్పందించిన పవన్ కళ్యాణ్
మా ఎన్నికల నేపథ్యంలో మా అధ్యక్ష పదవికీ పోటీపడే అభ్యర్థులందరూ పరస్పర వాదోపవాదులు చేసుకోవడంపై స్పందించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మా అధ్యక్ష ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులు అని.. మా ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్. `మా ` ఎన్నికల దృష్ట్యా ప్యానల్ సభ్యులు పోట్లాడవల్సిన అవసరం లేదని.. సినిమాలు చేసే వాళ్ళు ఆదర్శంగా ఉండాలని సూచించారు.`మా` ఎన్నికలు కారణంగా వ్యక్తిగత విభేదాలు చేసుకోవాల్సిన అవసరం లేదని మరియు సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్. మా ఎన్నికల్లో ఓట్లు వేసి వారు తొమ్మిది వందల ఓట్లు లేవని…దీని గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం అవసరమా ? అని ప్రశ్నించారు. ఇలాంటి పోటీ తానేప్పుడూ చూడలేదని ఈ ఎన్నికల కారణంగా నటుల మధ్య చీలిక రాకూడదని నా అభిప్రాయం అని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్.