హైదరాబాద్లో రూ.110 దాటిన పెట్రోల్ ధర!
హైదరాబాద్లో రూ.110 దాటిన పెట్రోల్ ధర!
ఢిల్లీ: గత నెల నుంచి దేశంలో మరోసారి ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం(17-10-2021) లీటర్ పెట్రోలుపై గరిష్టంగా 37 పైసలు, డీజిల్పై 38 పైసలు వరకు పెరిగింది.
ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డిజీల్ ధరలు బాగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరల ప్రకారం తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.110 కాగా..డీజిల్ రూ.100 పైగా దాటింది. ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.. ఈ ఇంధన ధరలపై వినియోదారులు మండిపడుతున్నారు. సాధారణ మానవుడు బ్రతకలేని పరిస్థితి అని ప్రభుత్వాలను ఎద్దెవా చేస్తున్నారు. మరోసారి పెరిగే ఇంధన ధరలు పెరిగే అవకాశం లేక పోలేదని వినియోగదారులు అంటున్నారు.