పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం…ఎంతో తెలుసా..?
దేశంలో రోజురోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీపావళి కానుకగా కేంద్రం ప్రభుత్వం వాహనదారులకు గుడ్న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు అర్థరాత్రి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలు విధించే పన్ను బట్టి ధరలు ఉంటాయి.