న్యూయార్క్ లో..పంది కిడ్నీని మనిషికి మార్పిడి
న్యూయార్క్ లో..పంది కిడ్నీని మనిషికి మార్పిడి చేసిన వైద్యులు
ఈనాడు వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులో ఉన్నది. అవయావాల మార్పిడి కూడా వేగంగా జరుగుతున్నది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పంది మూత్రపిండాన్ని మానవుడిలోకి మార్పిడి చేశారు. న్యూయార్క్ నగరంలోని NYU లాంగోన్ హెల్త్ లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మనిషికి అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దానికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనిషికి అమర్చే అంశంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
దీనిలో భాగంగా న్యూయార్క్ కి చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. న్యూయార్క్ లో బ్రెయిన్ డెడ్ అయిన (లేడి)ఓ రోగి కిడ్నీలు చెడిపోయాయి. అయితే కిడ్నీ దానం చేసేందుకు ఎవరూ రావడం లేదు. దీంతో ఆ వైద్యులు మూడు రోజులపాటు శ్రమించి పంది కిడ్నీని అమర్చారు. దీని తరువాత బ్రెయిన్ డెడ్ అయిన రోగి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగా పనిచేసింది. రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని వైద్యనిపుణులు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ డాక్టర్ల ప్రయోగంలో మానవ రోగులకు గుండె కవాటాల నుండి చర్మ అంటుకట్టుట వరకు గాల్సేఫ్ పందులు అన్నింటికి పరిష్కరంగా ఉంటాయని అందుకు పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.