కరోనా ట్యాబ్లెట్ తయారు చేసిన బ్రిటన్
కరో్నా ట్యాబ్లెట్ (పిల్) కనుగొన్న బ్రిటన్
ఇంకా గుర్తించని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
పిల్ తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చేశామంటున్న దేశాలు
కరోనా బాధితులకు గుడ్ న్యూస్. ఇంజెక్షన్ అంటే భయపడే వారికి కరోనాతో బాధపడే వారికి కోసం తొలిసారిగా ట్యాబెట్(పిల్) అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్ లోని ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’…”మోల్నుపిరవిర్” పేరుతో తయారు చేసిన ఈ ట్యాబ్లెట్. దీనిని వినియోగించడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ట్యాబ్లెట్.. కొంత మంది పై ప్రయోగాలు చేయగా.. కరోనాపై ఈ టాబ్లెట్ సమర్థవంతంగా పోరాడుతోందని తేలినట్లు బ్రిటన్ మెడిసిన్ రెగ్యులేటరీ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ఆ దేశంలో కొవిడ్ బారిన పడ్డ వయోజనుల కోసం ఈ ట్యాబ్లెట్స్ ను వినియోగిస్తున్నారు. అయితే కరోనా రిస్క్ ఫ్యాక్టర్లలో ఏదో ఒకటి బాధితులకు ఉంటేనే వీటిని తీసుకోవాలని యూకే నియంత్రణ సంస్థ సూచించింది. ఐదు రోజుల పాటు రోజుకు రెండు సార్లు ఈ ట్యాబెట్ ను వాడాల్సి వస్తుంది.
అయిదే ఆ దేశ బ్రిటన్ హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ మాట్లాడుతూ…”ఫ్లూ జ్వరాన్ని ట్రీట్ చేయడానికి వాడే ఈ గోలీ మందును …కొవిడ్ పేషెంట్లకు ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న కోవిడ్ పేషెంట్లలో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు సగం వరకు తగ్గాయాని… దీంతో పాటుగా ప్రాణాలు పోయేంత రిస్క్ నుంచి ఈ ట్యాబ్లెట్ బయటపడేస్తుందని పరిశోధనల్లో తేలింది.
ఈ టాబ్లెట్ గేమ్ చేంజర్ లాంటి ట్రీట్ మెంట్”అని తెలిపారు. మోల్నుపిరవిర్ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా సాధారణంగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. కొవిడ్ చికిత్సలో వినియోగిస్తున్న ఇంజెక్షన్ రూపంలో ఉన్న మందుల కంటే మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు చాలా మెరుగైందిగా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు.
మరోవైపు, అమెరికా సహా పలు దేశాల్లో మోల్నుపిరవిర్ దరఖాస్తు పెండింగ్లో ఉంది. అయితే ఈ టాబెట్ల తయారీకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతులు వచ్చాకే తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతులు లభించకముందే చాలా దేశాలు పిల్స్ కోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చేశాయని సమాచారం.