గర్భం దాల్చకుండా..త్వరలో మగవారికి పిల్స్..?

గర్భం దాల్చకుండా..త్వరలో మగవారికి పిల్స్..?

గర్భం దాల్చకుండా..త్వరలో మగవారికి పిల్స్..?

ధారుడ్యం తగ్గదంటోన్న పరిశోధకులు

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్న శాస్త్రవేత్తలు

ప్రయోగాలు చేయడంలో వైద్య శాస్త్రం ఎంతో ముందుకెళ్తోంది. అయితే దీనిలో భాగంగానే బ్రిటన్‌లోని స్కాట్లాండ్‌కు చెందిన డుండి యూనీవర్శిటీ పరిశోధకులు గర్భనిరోధక మాత్రలపై ప్రయోగాలు చేస్తున్నారు.

గర్భం దాల్చకుండా మగవారు వేసుకునే మాత్రల ప్రయోగానికి బ్రిటెన్ కరెన్సీ ప్రకారం  £ 1.2 మిలియన్ల (ఇండియాలో రూ.12.37 కోట్ల) నిధులన్ని ప్రోత్సాహాకంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇవ్వనుంది. దీంతో పురుషుల గర్భనిరోధక మాత్రల అభివృద్ధిపై పరిశోధనలు మరింతగా వేగంగా జరగుతున్నాయి. ప్రపంచంలో  ఎన్నో రకాల మెడిసిన్ తయారీ సంస్థల్లో డుండీ యూనీవర్శిటీ ఒకటి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పురుష గర్భనిరోధక ఔషధాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని డుండి యూనీవర్శిటి తెలిపింది. అయితే ఇప్పటి వరకు మగవారికి గర్భనిరోధక ప్రయోగాలపై ఎలాంటి మాత్రలు, ఔషధాలు కానీ లేవు.

ఈ దిశగా ప్రయోగాలు చేసేందుకు మానవ స్పెర్మ్ బయాలజీని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే కారణం. వీర్య కణాల కీలక విధులపై సరైన అధ్యయనాలు, ప్రయత్నాలు కానీ చేయలేదు. దీనిలో భాగంగానే మెక్రోస్కోప్ తో ప్రయోగించే సాధనాలను వీర్యకణాలను సూక్ష్మమంగా పరిశీలించేందుకు ఈ యూనివర్శిటీ పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. మగవారిలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్ వేగవంతంగా కదులుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ స్పెర్మ్ ఒకే దశలో ఖచ్చితమైన మార్గంలో ప్రయాణిస్తుందని వారి పరిశోధనలో కనుకొన్నారు.

ఈ ప్రయోగానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి నిధులు అందుతున్న తరుణంలో డుండీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బారట్ హర్షం వ్యక్తం చేశారు. అయితే మెడిసిన్‌ ఉత్పత్తికి, ప్రయోగాలు చేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.

స్త్రీ పురుషుల కలయికలో కండోమ్స్ ఒక భాగంగా నిలిచాయి. అయితే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా  ప్రకటనలు, వాడే విధానాన్ని తెలియజేశారు. పురుషుల గర్భనిరోధక పిల్స్ తయారీకీ గణనీయమైన మార్పులు జరగలేదని క్రిస్‌ తెలిపారు. దీంతో అవాంఛిత గర్భాల నుండి రక్షించే భారం చాలా వరకు మహిళలపై పడుతున్నదని అన్నారు. ఈ అసమానతను పరిష్కరించాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనల కోసం బిల్ అండ్‌ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి మునుపటి రౌండ్ నిధులు అందనుండటంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పురుషుల సంతానోత్పత్తి పరిశోధనలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తమ నైపుణ్యం, ఔషధం రూపకల్పనలో తమ జ్ఞానాన్ని ఈ పరిశోధనను కొనసాగించడానికి వినియోగిస్తామని క్రిస్ బారట్ తెలిపారు. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు జరగుతున్నాయని  తొలి దశలో భాగంగా మగవారి గర్భనిరోధక మాత్రలను అభివృద్ధి చేసే అధిక నాణ్యత సమ్మేళనాన్ని గుర్తించాలనుకుంటున్నామని చెప్పారు. అయితే శృంగార శక్తిని మాత్రం తగ్గకుండా.. గర్భం దాల్చకుండా ఉండేందుకు మాత్రమే ఈ పిల్స్ తయారీ విధానం ఉంటుందని తెలిపారు. మగవారి గర్భ నిరోధకంలో కొత్త  శకాన్ని ప్రపంచ వ్యాప్తంగాఎదురు చూస్తారని క్రిస్ బారట్ తెలిపారు.  ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *