PM కిసాన్ సమ్మాన్ నిధులు రిలీజ్

విడుదలైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు
9వ విడుత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. స్వయంగా ప్రధాని రైతులకు వర్చువల్ గా డబ్బులు జమ చేసారు. దేశంలోని రైతులకు రూ.19,500కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే ప్రతి రైతు ఖాతాలో కిసాన్ సమ్మాన్ కింద రూ.2వేలు జమ అయ్యాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నగదు జమ కాకపోతే 011-24300606కి కాల్ చేయోచ్చు. లేదా ప్రాంతీయ వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించొచ్చు